Wednesday, December 12, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

షాకింగ్ న్యూస్ : ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం కోసం పోరాటం చేస్తున్న వై యస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ప్రజల మనోకాంక్ష నెరవేర్చడానికి ఆయన తీవ్ర పోరాటం చేయ్యదలుచుకున్నారా? ఆయన నిజంగానే యం యల్ ఏ పదవికి రాజీనామా చెయ్యబోతున్నారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం నిజమనే సమాధానం వస్తోంది. ముఖ్యంగా వై యస్ జగన్ హోదా కోసం  చేస్తున్న పోరాటం ఇప్పటికే జాతీయ స్థాయి నాయకత్వాన్ని కదిలించింది. ఆయన ప్రత్యెక హోదా కోసం పార్లిమెంట్ లో చేస్తున్న ఆందోళన రాష్ట్ర అధికార పక్షాన్ని కంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తోంది. మరొక విధంగా చెప్పాలి అంటే , అధికార పక్షమైన చంద్రబాబు ప్రభుత్వం కన్నా, వీరి మాటకే ఎక్కువ చెల్లుబాటు కనపడుతోంది.

రాజీనామా:

అందుకే మరి కాసేపట్లో వై యస్ జగన్ , రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకంగా రాజీనామా చెయ్యడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన స్టైల్ లో ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి చెప్పే జగన్ ఈ సారి అసెంబ్లీ సాక్షిగా బాంబుని పేల్చారు. తాను ఇక మాట నిలబెట్టుకోక పొతే , రాజీనామా చేసి ప్రజా నాయకుడిగా పోరాటం చెయ్యడానికి సిద్ధం అని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో రాజీనామా చేసి జగన్ ప్రజల వద్దకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు అని తెలుస్తోంది.

బిగుస్తున్న ఉచ్చు:

వై యస్ జగన్ ఎవ్వరికీ కొరకరాని కొయ్యగా కనిపించడంతో , ఆయనను ఎలాగైనా అనిచివేయ్యడానికి కేంద్ర , రాష్ట్ర అధికార పార్టీలు పూనుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే జగన్ పై కేసులను తిరిగి తవ్వి బయటకు తీయడానికి సిద్ధం అవుతున్నట్టు కనబడుతోంది. వై యస్ జగన్ నిజాయతీగా ప్రజల తరపున చేస్తున్న పోరాటం నీర్ గారాలంటే ప్రస్తుతం ఉన్న ఏకైక ఆప్షన్ అదే. ఎందుకు అంటే , జగన్ ని కేసులో ఊబిలో ముంచితే , వాటి నుండి బయటపడటానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది కాబట్టి. ఈ నేపథ్యంలో , వై యస్ జగన్ పై ఉన్న పెండింగ్ కేసులకు సంబంధించి ఫైలుని సుప్రీమ్ కోర్టుకి కేంద్ర ప్రభుత్వం సమర్పించింది. హైరబడులో ఏర్పాటు అయ్యే ఈ ప్రత్యెక కోర్టుకు సిబ్బంది , బుద్గేట్ కేటాయింపులకు సంబంధించి ఆధిక శాక జీవో జారీ చేసింది.ఆ జీవో ప్రకారం హైకోర్టు ప్రత్యెక కోర్టు ఏర్పాటుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు.

హైదరాబాదులోనే:

వై యస్ జగన్ కు సంబందించిన కేసులు అన్నీ హైదరాబాద్ పరిధి లోనే , అంటే తెలంగాణా పరిధిలోనే ఉన్నాయి. ఆయన ఎక్కడ నుండి ప్రాతినిధ్యం వహించినా కోర్టు పరిధి ప్రకారం విచారణ జరగడం ఖాయం. అందుకే వై యస్ జగన్ పోరాటం జరుగుతున్నా ఆంధ్ర ప్రదేశ్ ని వదిలేసి హైదరాబాదులో ఉండాల్సి వస్తుంది. అందుకే , వై యస్ జగన్ వీటన్నింటికీ దీటుగా వ్యూహం పన్నుతూ , ప్రత్యేక హోదా కోసం ఉద్యమించడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఆయన రాజీనామా చెయ్యడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.