Wednesday, March 27, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

మా నాన్న బ్రతికున్నంత కాలం నేను మంచి వాడిని …మరి ఇప్పుడు ?

ప్రత్యెక హోదాపై ఉద్యమంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్న నాయకుడు జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో సాగించాదలుచుకున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గుంటూరులో ప్రవేశించారు. ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా తన లక్ష్యాలను , భావోద్వేగాలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు వ్యతిరేకంగా అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారు అని అన్నారు.

ప్రజా సమస్యలను నేరుగా వారిని కలిసి తెలుసుకుందామని తాను ఈ యాత్ర చేబట్టానని , అందుకు ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తోంది అని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నాకే మ్యానిఫెస్టో ని తయారు చేయాలని తను సంకల్పించానని ఆయన అన్నారు. తద్వారా ప్రత్యెక హోదా డిమాండ్ కు కావలసిన ప్రజా అవసరాలను తాను వెలుగులోకి తీసుకువచ్చి జాతీయ స్థాయి నాయకులని కదిలించాలని ఫిక్స్ అయ్యానని అన్నారు.

తన తండ్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత …. తమ సొంత పార్టీ అయిన కాంగ్రెస్ తో విబెదించడమే కాకుండా , బయటకు వచ్చి తాను ప్రజల కోసం మరొక పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆ కారణం తోనే తన మీద అకారణంగా డజన్ల కొద్దీ కేసులు బుకాయిస్తున్నారని జగన్ అన్నారు. ‘ మా నాన్న బ్రతికున్నంత కాలం నన్ను గౌరవనీయమైన వ్యక్తి గా పిలిచే వారు , ఇప్పుడు నన్ను జగన్ గాడు అని సంబోదిస్తున్నారు ‘ అని ఆయన అన్నారు. మరణానంతరం నాయకులు ఎంతగా అవకాశ వాదులుగా మారిపోతారో చెప్పడానికి ఇదే తార్కాణమని తెలిపారు. ఇంతగా అవకాశవాద రాజకీయాలు ఎక్కడ కూడా చేసే వాళ్ళని నేను చూడలేదని తెలిపారు.

కాంగ్రెస్ , తెలుగు దేశం పార్టీ ఇద్దరూ కలిసి తన మీద అక్రమంగా కేసులు బనాయించారని బాధ పడ్డ జగన్ , రాజకీయ దురుద్దేశ్యాలు లేకుండా ఇలాంటి కేసులు ఇన్ని సంవత్సరాలు తన పై ఎందుకు నడుపుతున్నారో వారు ప్రజలకు చెప్పాలన్నారు. నేను ప్రజల్లోకి వచినప్పుడే ఈ కేసులు వారికి ఎందుకు గుర్తుకు వస్తాయో వారికే తెలియాలి అన్నారు. అయినా సరే , నా దగ్గర ప్రజా బలం ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు అని కూడా అన్నారు.

సాధారణంగా కేంద్ర ప్రభుత్వానికి మిత్ర పక్షంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యెక హోదా కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అది చంద్రబాబుకి చాలా చిన్న పని అని అన్నారు. అలా కాకుండా చంద్రబాబు స్వార్థం మాత్రమే చూసుకుంటూ పని చెయ్యడం వలన రాష్ట్ర ప్రయోజనాలు కుంటు పడ్డాయని అన్నారు. అందుకే హోదా విషయం లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యలో ప్రతిష్టంభన ఏర్పడి హోదా ఇంత లేట్ అవుతోంది. ఇసుకు , మట్టి , కరెంటు , బొగ్గు , మద్యం ,.. ఏది వదిలిపెట్టకుండా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడే సీయం ఉండటం మన రాష్ట్రం చేసుకున్న ఖర్మ అన్నారు.

మొత్తం మీద వై యస్ జగన్ ఎన్నో రోజుల తరువాత నిజాయతీగా,  తాను ఎదురుకుంటున్న గడ్డు పరిస్థితులను వివరించారు. ఏదైతేనేం , వై యస్ జగన్ పోరాటం ఈ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి