Wednesday, March 27, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

Viral Post : రైతుల గురించి మనకెందుకు

మహారాష్ట్రలోని రైతులు చేస్తున్న ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకరిర్శించింది. దాదాపుగా 50 వేల మంది రైతులు తమకు ఉన్న డిమాండ్ ల గురించి పోరాటం చేసి నెగ్గించుకున్నారు. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వారు రాత్రి పూట చేసిన నిశబ్ద నిరసన దేశవ్యాప్తంగా వారికి మద్దత్తుని తీసుకువచ్చింది. అయితే జాతీయ మీడియా ఈ సంఘటనని నిర్లక్ష్యం చెయ్యడం పట్ల పలువురు సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అనవసరమైన పలు విషయాల పట్ల శ్రద్ధ వహించే మీడియా , రైతుల కష్టాల పట్ల ఇలా శీత కన్ను చూపియ్యడం ఎవ్వరికీ రుచించలేదు. ఈ సందర్భంగా ఒక సామాన్యుడు రాసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఏముంది అంటే …

మనకెందుకు

నాసిక్ నుంచి ముంబై వరకు 30 వేల రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనగా 180 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారట………..

మనకెందుకు

అదేమైనా స్టార్ హీరో కొత్త పార్టీ ఆఫీసు భూమి పూజా లైవ్ పెట్టి మరీ జనాలను మేల్కొల్పడానికి…….

మనకెందుకు

అక్కడేమి హీరోయిన్ స్నానాల గదిలో చనిపోలేదు దారుణమైన ఘోరం జరిగినట్టు రాబోయే విపత్తు గురించి సమాజాన్ని హెచ్చరించడానికి…..

మనకెందుకు

అక్కడ వయసు మళ్ళిన ఓ రాజకీయ కురువృద్ధుడికి అవమానం ఏమి జరగలేదు అంతర్జాతీయ సమాజంలో భారతదేశ పరువు పోతోందని బాధపడడానికి…….

మనకెందుకు

ప్రపంచపటంలో ఎక్కడుందో కూడా తెలియని ఒక దేశంలో మారణకాండ జరగలేదు ఇక్కడ జాతీయ రహదారులను స్తంభించి నిరసన తెలియజేయడానికి……

మనకెందుకు

అక్కడ ఎవడూ వేల కోట్ల జనం డబుల్ని దొబ్బేసి విదేశాల్లో ఎంచక్కా పడక కాలు మీద కాలు వేసుకుని ఫారిన్ టీవీలో ఇక్కడి వార్తలు నవ్వుతూ చూడటం లేదు అయ్యో అని గుండెలు బాదుకోవడానికి…..

మనకెందుకు

అక్కడెవరు హోదా విషయంలో నాటకాలాడిన వాళ్లకు సన్మానాలు చేసేందుకు నడవడం లేదు……..

మనకెందుకు

ఆఫ్ట్రాల్ రైతులు, అక్షరం ముక్క రాని పల్లెటూరి బైతులు….

వాళ్లతో మనకెందుకు, వాళ్ల ఘోష మనకెందుకు…..

పిజ్జాలు పండిస్తున్నారా?

నాచోస్ విత్తుతున్నారా ?

ఐస్ క్రీమ్ ని పుట్టిస్తున్నారా?

మందుని సాగు చేస్తున్నారా?

అసలు ఎందుకు పట్టించుకోవాలి……ఎందుకు ఆలోచించాలి……

మనకెందుకు…..పదరా భాయ్ అవతల ట్వంటీ ట్వంటీ మ్యాచ్ పెట్టుకుని ఏంటీ సోది…..

చల్ చల్….

Ravindra Nath SriRaj