Saturday, June 23, 2018

మహిళా దినోత్సవం ఎలా మొదలయ్యింది ?

స్త్రీ లేనిదే జీవితం లేదు.

స్త్రీ లేనిదే సృష్టి కూడా లేదు

ఎందుకంటే భగవంతుడు కూడా ఒక తల్లికి కొడుకే అయ్యుంటాడు.

ఇలా మహిళల గురించి మనం రాసుకున్న మాటలు వందలు వేల కొద్దీ వింటూ ఉంటాము. వీటన్నింటిని గుర్తు చేసుకోవడానికి , మహిళలకు మన కృతఘ్నతని తెలియచేయడానికి మనమందరం కలిసి ఒక రోజుని ఎన్నుకున్నాం. అదే, ప్రపంచ మహిళా దినోత్సవం. అసలు ఆ రోజుకి ఆ పేరు ఎలా వచ్చింది? అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక అసలు కథ ఏమిటి ? ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది చెబుతున్న కథ ప్రకారం , మార్చి 8 తారీఖున మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణం అమెరికాలో పింగాణీ కర్మాగారాల్లో పని చేసే మహిళలు స్ట్రైక్  చేసిన రోజు అని. కానీ అసలు కథ వేరు. ముందుగా , 1910 ఆగస్టులో డెన్మార్క్ దేశంలో . ప్రపంచ మహిళల కాన్ఫరెన్స్ వారు, ఒక సదస్సుని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ప్రపంచంలోని ప్రతి మహిళకు కృతఘ్నతగా ఒక రోజుని అంకితం ఇవ్వాలని తలచారు. అయితే అప్పటికి వారందరూ ఒక తారీఖుని ఇంకా ఎన్నుకోలేదు. ఆ విషయం పైన చాలా సార్లు తర్జన భర్జనలు చేశారు. కానీ , ఆ సమావేశం తరువాత ప్రపంచంలో లోని ప్రతీ మహిళకు సమాన హక్కులు కావాలి అని అంటూ ఉద్యమాలు మొదలయ్యాయి.  1911, మర్చి 19 వ తారీఖున దాదాపుగా పలు దేశాల్లో దాదాపుగా 10 లక్షల మంది జనాలు, ఉద్యమంలో పాల్గొని స్త్రీ హక్కుల కోసం పోరాటం చేశారు. ఆ తరువాతే , వీరి ఉద్యమాన్ని గుర్తించిన న్యూ జిలాండ్ ప్రభుత్వం చరిత్రలో మొట్టమొదటి సారి మహిళలకు ఓటు హక్కుని ప్రకటించింది.

1914 కల్లా , జెర్మనీ లో దాదాపుగా మహిళలు అందరూ కలిసి మార్చి 8 న మహిళా దినోత్సవం గా జరుపుకోవాలని తీర్మానించారు. కానీ , ఆ తరువాతి కాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం వలన ఎవరు కూడా , ఆ విషయం పై నోరు ఎత్తడానికి ధైర్యం , అవకాశం చిక్కలేదు. అయితే , 1917 న జరిగిన ఒక సంఘటన ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని ముద్ర వేసింది. అప్పటి రష్యన్ సామ్రాజ్యంలో , పెట్రోగ్రాడ్ ( స్టాలిన్ గ్రాడ్ ) లో అప్పటి మహిళలు ” ఆహారం కోసం , శాంతి కోసం ” పోరాటం చెయ్యడానికి స్ట్రైక్ నిర్వహించారు. ఆ రోజున జరిగిన ఉద్యమాన్ని అప్పటి రష్యా రాజు అయిన జార్ దారుణంగా అణిచివేశాడు. ఆ సంఘటన తరువాతనే రష్యా విప్లవం ఆవిర్భవించింది. ఒక రకంగా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన కమ్యూనిస్ట్ ఉద్యమం మొదలయ్యింది ఆ రోజునే. అంతటి ఉద్యమం కూడా మొదలయ్యింది , ఆ రోజు మహిళలు చేసిన పోరాటం వలనే.

ఆ తరువాత మహిళా దినోత్సవం గురించి ప్రపంచ సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ , మహిళా హక్కులు కోసం జరుగుతున్న ఉద్యమాలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఐక్య రాజ్య సమితి , మార్చి 8 తారీఖున మొట్టమొదటి సారి అధికారికరంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.

అదీ మహిళా దినోత్సవం వెనుక అసలు  కథ.