Monday, March 25, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

హైస్పీడ్ లో జ‌గ‌న్..ప‌త్తా లేని లోకేశ్..?

రాష్ట్ర యువ‌మంత్రి,కాబోయే ముఖ్య‌మంత్రి నారా లోకేశ్ బాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే ఉన్నాడా..? ఉంటే ఎక్క‌డ‌..? ప్ర‌భుత్వ పనుల్లో బిజీగా ఉన్నాడా..లేక సెలవుల‌పై ఎక్క‌డికైనా వెళ్లాడా..? ఎక్క‌డికెళ్లినా రాష్ట్రంలో గ‌త వారం,ప‌ది రోజులుగా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు ఆయ‌న దృష్టికి రాలేవా.? వ‌చ్చినా మాట్లాడ‌లేక‌పోతున్నారా..? చంద్ర‌బాబు నాయుడే ఆచితూచి మాట్లాడుతున్న ప‌రిస్థితి ఉంటే,ఇక తాను మాట్లాడి లేనిపోని నోరు జారుడు ఎందుక‌ని భ‌య‌ప‌డుతున్నాడా..? ఆ భ‌య‌మే చిన‌బాబును ప్ర‌త్యేక హోదా అంశానికి దూరంగా ఉంచుతుందా..? ఇలా ఒక‌టి రెండు కాదు,వంద‌ల ప్ర‌శ్న‌లు టీడీపీ నాయ‌కుల‌నే త‌లిచివేస్తున్నాయంటే ఇక ప్ర‌తిప‌క్షం వాళ్ల‌ను, ప్ర‌జాసంఘాల‌ను,జ‌నాల‌ను ఏ విధంగా ట‌చ్ చేస్తాయో వేరే చెప్ప‌క్క‌ర్లేదు.

ప్ర‌త్యేక‌హోదా కోసం ఏపీ అంతా అట్టుడుకుతుంటే,భావిత‌రాల‌కు కావాల్సిన నాయ‌కుడు నారా లోకేశ్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందిచ‌లేదు.క‌నీసం బ‌య‌టికొస్తే ఎక్క‌డ ప్ర‌శ్నిస్తారో అన్న భ‌యంతోనే ఆయ‌న మీడియాకు కూడా ముఖం చాటేశార‌ని ప‌లువురు జ‌ర్న‌లిస్టు మిత్రులే చ‌ర్చించుకునేంత స్థాయికి చేరుకున్నారు యువ‌మంత్రి చిన‌బాబు గారు. తెలుగుదేశం పార్టీలో కీల‌కం అని చెప్పుకునే నాయ‌కులంతా ప్ర‌త్యేక హోదా గురించి అవ‌కాశం దొర‌క‌బుచ్చుకుని మ‌రీ బీజేపీపై,కేంద్ర‌ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతుంటే, లోకేశ్ మాత్రం కంటికి క‌న‌ప‌డ‌కుండా పోవ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. భ‌విష్య‌త్తులో చంద్ర‌బాబు నాయుడు కేంద్ర రాజ‌కీయాల‌పై దృష్టి సారించాలంటే రాష్ట్రంలో లోకేశ్ బ‌లం పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. త‌న ఒంటి చేత్తో టీడీపీని,రాష్ట్రాన్ని ఈద‌గ‌ల‌డు అని చంద్ర‌బాబు న‌మ్మినప్పుడే లోకేశ్ పై మ‌రిన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంటుంది.కానీ లోకేశ్ మాత్రం పార్టీపైనే ఇంకా పూర్తిస్థాయిలో ప‌ట్టు సాధించ‌లేదనేది కొంద‌రి వాద‌న‌.అలాంటప్పుడు ఇక ప్ర‌భుత్వ బాధ్య‌త‌ల‌ను చూసుకోగ‌ల‌డా అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

కేటీఆర్ తో పోల్చుకుంటే…?

ఏపీలో లోకేశ్ బాబు ప‌రిస్థితి ఇలా ఉంటే, తెలంగాణకు సంబంధించి యువ‌మంత్రి కేటీఆర్ మాత్రం దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో సీఎం త‌ర్వాత స్థానం కేటీఆరే అనేంత‌గా జోరుమీదున్నారు.రాష్ట్రంలో ఏ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌యినా, దాన్ని ప‌రిష్క‌రించేందుకు,ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించేందుకు త‌న‌దైన స్టైల్లో దూసుకుపోతున్నాడు.తాజాగా కేసీఆర్ దేశ‌రాజ‌కీయాల్లో వెళ్తున్నానంటూ ప్ర‌క‌ట‌న వ‌చ్చిందే ఆల‌స్యం, కేటీఆరే కాబోయే ముఖ్య‌మంత్రి అంటూ ఇటు మీడియాలోనూ,అటు రాజ‌కీయ నేత‌ల్లోనూ చ‌ర్చ జ‌రుగుతుంది.రాష్ట్రానికి ఐటీ కంప‌నీల‌ను తేవ‌డంలోనూ, యువ‌త‌కు ఐకాన్ గా మార‌డంలోనూ కేటీఆర్ స‌క్స‌స్ అయిన‌ట్లు చెప్ప‌వ‌చ్చు.కానీ ఏపీలో మాత్రం ప‌రిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. మంత్రి లోకేశ్ సాధార‌ణ స‌భ‌ల‌పైనే స‌రిగ్గా మాట్లాడలేని ప‌రిస్థితి.ఇప్ప‌టికే ప‌లుమార్లు నోరు జారి అవ‌మానాల పాలైన లోకేశ్…ప్ర‌త్యేక‌హోదాపై కూడా అందుకే పెద‌వి విప్ప‌డం లేద‌ని అంటున్నారు రాజ‌కీయ నిపుణులు.

జ‌గ‌న్ తాకిడిని త‌ట్టుకోగ‌ల‌డా..?

రాష్ట్రంలో జ‌గ‌న్ స్పీడును త‌ట్టుకోవాలంటే లోకేశ్ త‌న వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీ ఎంత ప‌వ‌ర్ ఫుల్ పార్టీనో చంద్ర‌బాబుకు రుచి చూపించాడు జ‌గ‌న్.గెల‌వ‌క‌పోయిన‌ప్ప‌టికీ త‌న సత్తా చాటి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా నిల‌బ‌డ్డాడు.ఇక రాబోయే రోజుల్లో జ‌గ‌న్,లోకేశ్ ల మ‌ధ్యే వార్ ఉండ‌నుంది.జ‌గ‌న్ను త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే లోకేశ్ మ‌రింత రాజ‌కీయ అవ‌గాహన‌ను,ప‌రిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.లేనిప‌రిస్థితుల్లో తండ్రి చాటు కొడుకులా మిగిలినా ఆశ్చ‌ర్య‌పడాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికైనా మునిగింది ఏం లేదు.. ఇక‌నుంచైనా లోకేశ్ ప్ర‌త్యేక‌హోదాపై పెద‌వి విప్పాల‌ని,పోరాటంలో ముందు నిల‌వాల‌ని కోరుకుందాం.చంద్ర‌బాబును మించిన నాయ‌కుడు అవ్వాల‌ని ఆశిద్దాం.