Saturday, June 23, 2018

టీఆర్ఎస్ అవ‌కాశం.. ఆ ముగ్గురికే..?

ఎవ‌రి అదృష్టం ఎంత ఉందో తేల‌బోతుంది.రాజ్య‌స‌భ స‌భ్యుల నామినేష‌న్ గ‌డువు సోమ‌వారంతో ముగియ‌బోతున్న సంద‌ర్భంగా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు పార్టీలు స‌మాయ‌త్తం అవుతున్నాయి.ఇక తెలంగాణ నుంచి మూడు స్థానాల‌కు ఎన్నిక జ‌ర‌గ‌నుండ‌గా,ఆ మూడు స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలిచే అవ‌కాశం ఉంది.కాక‌పోతే కాంగ్రెస్ పార్టీ సైతం త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో దింపాల‌ని నిర్ణ‌యించ‌డంతో ఒక స్థానానికి ఎన్నిక అనివార్యం కానుంది.అయితే కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అజారుద్దీన్ ,ర‌వీంద్ర నాయ‌క్ ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.వీరిద్ద‌రిలో ఒక‌రు ఫైన‌ల్ అన్న సంకేతాలు స్ప‌ష్టం అవుతున్నాయి.ఇక ఎవ‌రు పోటీ చేసినా ఓడిపోవ‌ట‌మే మిగిలున్న అంశం.ఎందుకంటే ఆ పార్టీకి కావాల్సిన‌న్ని ఓట్లు లేవు.దీంతో అధికార టీఆర్ఎస్ మూడింటికి మూడు సీట్ల‌ను త‌మ ఖాతాలో వేసుకోవ‌టం అన‌ధికారికంగా క‌న్ఫాం అయింది.

కాక‌పోతే ఆ ముగ్గురు ఎవ‌ర‌న్న‌దే తేలాల్సి ఉంది. ప్ర‌ముఖంగా యాద‌వుల కోటా నుంచి జైపాల్ యాద‌వ్ పేరు ఫైన‌ల్ అయిన‌ట్లు ఊహాగానాలు వస్తున్నాయి.ఆయ‌న కాద‌నుకుంటే క‌రీంన‌గ‌ర్ జ‌డ్పీ చైర్మ‌న్ తుల ఉమ,నాగార్జున సాగ‌ర్ ఇంచార్జ్ నోమ‌లు న‌ర్సింహ‌య్య ల పేర్ల‌ను కూడా ప‌రిశీలించే అవ‌కాశం ఉంది.

ఇక రెండో సీటు మైనార్టీల‌కు ఇవ్వాలా,రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఇవ్వాలా అన్న‌దానిపై కేసీఆర్ మ‌ల్ల‌గుల్లాలు పడుతున్న‌ట్లు స‌మాచారం.దాదాపుగా మైనార్టీల‌కే ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ శ్రేణులు చెబుతున్న మాట.అదే నిజ‌మైతే అలీఖాన్ పేరు ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉందంటున్నారు.

ఇక మూడో సీటు ఎప్పుడో ఖ‌రారైంద‌ని స‌మాచారం. కేసీఆర్ నీడ‌లా ఉండే టీఆర్ఎస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అయిన జోగున‌ప‌ల్లి సంతోష్ కుమార్ అభ్య‌ర్థిత్వం ఫైనల్ అయింద‌ని తెలుస్తుంది.ఆయన పైకి క‌నిపించ‌క‌పోయినా,లోలోప‌ల టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన వారిలో ఒక‌రు అన్న సంగ‌తి టీఆర్ఎస్ శ్రేణుల‌కు మాత్ర‌మే తెలుసు. కేసీఆర్ వెన్నంటే ఉంటూ టీఆర్ఎస్ పార్టీకి బాస‌ట‌గా,టీన్యూస్ ఎండీగా సంతోష్ సేవ‌లు అనేకం ఉన్నాయ‌ని అంటున్నారు పార్టీ మిత్రులు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే జోగున‌ప‌ల్లి పేరును పార్టీ నేత‌లే పైకి తీసుకొచ్చి మ‌రీ అధిష్టానం వ‌ద్ద రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఖ‌రారు చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.కాక‌పోతే జోగున‌ప‌ల్లి కూడా కేసీఆర్ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రు అయినందువ‌ల్ల ఆయ‌న‌కు ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని అనుమానాలు కూడా వ్య‌క్తం అయ్యాయి.కానీ పార్టీ క్యాడ‌ర్ ఒత్తిడి మేర‌కే సంతోష్ కుమార్ కు లైన్ క్లియ‌ర్ అయింద‌ని టీఆర్ఎస్ శ్రేణులే చెప్తున్న మాట‌.ఈ ముగ్గురు అభ్య‌ర్థుల పేర్ల‌ను ఇవాళ అధికారికంగా కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.