Monday, September 24, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

మీరు గొడవ పడే రకమా? కాదా ? ఇలా తెలుసుకోవచ్చు!

FRIEDMAN మరియూ ROSENMAN అనే ఇద్దరు హృద్రోగ నిపుణులు తమ రోగులలో కొందరి ప్రవర్తన భిన్నంగా ఉండడం గమనించి ఈ విషయాన్నీ వారు పరిశోధించారు. వారు డాక్టర్స్ కోసం వేచి చూడడం లో తీవ్ర అసహనం ప్రదర్శించారు. వీరిని ఈ వైద్యులు టైప్ – A పర్సనాలిటీగా పిలిచారు. ఇందుకు భిన్నమయిన ప్రవర్తన కలిగిన వారిని టైప్ – B పర్సనాలిటీగా పిలిచారు. తరువాత ఈ కాన్సెప్ట్ ని సైకాలజీలో ఉపయోగించడం ప్రారంభించారు. వ్యక్తుల ప్రవర్తనను బట్టి రెండు రకాల పర్సనాలిటీ లు గా విభజించారు.

మొదటి రకం టైప్ – A : వీరిలో పోటీ తత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ దానిలోనూ విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ప్రతీ పనిలోనూ తొందర ఎక్కువగా ఉంటుంది. ఇతరులను భరించలేరు. సహనం కోల్పోతుంటారు. త్వరగా కోపం వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి తో బాధ పడుతుంటారు. వీరికి హుద్రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి.

రెండవ రకం టైప్ – బి : వీరిలో పోటీ తత్వం ఉండదు. ఎప్పుడూ నెమ్మదిగా ఉంటారు. సహనంతో ఉండి పనులు చక్కబెట్టుకుంటుంటారు. ఓర్పుతోను, ఇతరులను నొప్పించకుండా తమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ ఉంటారు. వీరిలో ఎమోషన్స్ చాల తక్కువగా ఉంటాయి. అరుదుగా మాత్రమే కోపం వస్తుంది. ఒత్తిడి చాల తక్కువగా ఉంటుంది.

సైకలాజికల్ టెస్ట్ ద్వారా ఒక వ్యక్తి టైప్ – A పర్సనాలిటీ నా లేదా టైప్ – B పర్సనాలిటీ నా నిర్దారించవచ్చు. ఒక వేళ ఎవరయినా టైప్ – A పర్సనాలిటీ ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇతరులతో పోట్లాటలు వంటివి తగ్గించవచ్చు. తద్వారా గుండె సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

పై పద్దతిలో మనిషి నిజాన్ని ఒక సారి గుర్తించిన తరువాత, వారిని ఎలా మలుచుకోవచ్చు , వారికి కోపం తెప్పించే ఎమోషనల్ ట్రిగ్గర్స్ ఏమేమి ఉన్నాయి అన్న విషయం గుర్తించాలి. దాని ద్వారా , అవతలి వ్యక్తితో సరిగ్గా డీల్ చేస్తే గొడవ పడే అవకాశం తక్కువ.

 

హరి రాఘవ్