Saturday, June 23, 2018

ఒకప్పుడు ఓలా క్యాబ్ డ్రైవర్ .. ఇవాళ ఆర్మీ సోల్జర్

అతను సామాన్యుడు. నిరంతరం అందరిలానే మంచి ఉద్యోగం ల, జీవనం కోసం పోరాడుతున్న నీరుద్యోగి. అయితేనేం, అతని సంకల్పం అతనిని ఉన్నత శిఖరాలను తీసుకెళ్లింది. ఒకప్పుడు ఓలా లో క్యాబ్ డ్రైవర్ గా జీవనాన్ని కొనసాగిస్తున్న అతని జీవితం ఇప్పుడు భారతీయ ఆర్మీలో చేరడం తో ఉన్నత శిఖరాలను చేరింది. కుటుంబం కోసం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న అతని కష్టాలు అతనిని ఏమాత్రం బాధించకపోగా మరింత పట్టుదలతో చేసిన కృషి అతని జీవితాన్ని ఊహించలేనంత మలుపు తిప్పేసింది.

మహా రాష్ట్ర లోని పూణే కి దగ్గర్లోని తండాల్ గ్రామానికి చెందిన ఓం పైతాన్ అత్యంత బీద కిటుంభం నుండి వచ్చాడు..చిన్నప్పటి నుండి ఉన్నతమైన జీవనాన్ని సాగించాలని ఎంతో కష్టపడి చిన్న చిన్న ఉద్యోగాలు చేసాడు. వచ్చిన డబ్బులు మొత్తాన్ని కుటుంబం కోసం ఇక మిగిలిన డబ్బుని చదువు కోసం ఖర్చుపెట్టే వాడు. ఓం తండ్రి ఉత్తమ్ డ్రైవర్ గా 30 ఏళ్ల పాటు కుటుంబాన్ని నడిపాడు. అతని బాటలోనే కొడుకు కూడా క్యాబ్ డ్రైవర్ గా కొనసాగుతూ ఓలా క్యాబ్స్ లో డ్రైవర్ గా చేరి కేజ్టుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. సమయం చిక్కినప్పుడల్లా, తాను కొనుక్కున్న పుస్తకాలు తీసుకుని వాటిలో చదువుతూ గడిపేవాడు.

ఒక రోజున అతని క్యాబ్ లో ఒక పెద్దాయన కూర్చున్నాడు. మాటల మధ్యలో సీట్ లో ఉన్న పుస్తకాల గురించి వాకబు చేసాడు ఆ పెద్ద మనిషి. తీరా చూస్తే, ఓం ఉద్యోగ పరీక్షల కోసం చదువుతున్నాను అని చెప్పడంతో అతనికి ఆర్మీలో కొత్త ఉద్యోగాలు పడుతున్నాయి అని సలహా ఇచ్చాడు ఆ పెద్ద మనిషి. తీరా ఆ పెద్ద మనిషి వెళ్ళాక టీవీ పెట్టి చూస్తే తన క్యాబ్ లో కూర్చున్న మనిషి కనిపించాడు. అతనెవరో కాదు, దేశం మొత్తానికి గర్వకారణమైన సైనికుడు కల్నల్ బక్షి. ఇక ఆయన చెప్పిన మాటల స్పూర్తితో ఓం డైరెక్ట్ గా ఆర్మ్ ఉద్యోగాలకు అప్లై చేసి చదివాడు. ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని మలుపు తిప్పేసిందనే చెప్పాలి.

ప్రస్తుతం ఆర్మీలో చేరిన ఓం అక్కడ ఆఫీసర్లు ట్రైనింగ్ పూర్తించేసుకుని సర్వీసెస్ కి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు.

కుమారుడు ఆర్మీ ఆఫీసర్ గా ఎన్నిక అవ్వడంతో ఆనందంలో మునిగిపోయిన తండ్రి, కొడుకు విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తన బిడ్డ దేశం కోసం ప్రాణాలు తెగించే పనిలో పడటంతో అతని కుటుంబం మొత్తం ఆనందంగా ఉన్నారు. నిజమే కదా, నిత్యం సీఆర్ డ్రైవింగ్ లో గడిపే స్థాయి నుండి దేశం కోసం పోరాడే స్థాయికి వెళ్లడం గొప్ప విషయమే కదా.