Wednesday, March 27, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

ప‌వ‌న్ పడుకుంటేనే ఛాన్స్ ఇస్తాడా….?

ఆవేశంతో మాట్లాడుతున్నారో లేక‌,అనుభ‌వాల గురించి చెప్తున్నారో తెలీదు కానీ, సినీ ఇండ‌స్ట్రీపై కొంద‌రు హీరోయిన్లు చేస్తున్న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మీడియా ముందుకు వ‌స్తున్న చిన్నా చిత‌కా హీరోయిన్ల‌తో పాటు,పాపులారిటీ సంపాదించుకున్న వారు సైతం ఆఫ‌ర్లు రావాలంటే అన్నీ వ‌దులుకోవాల్సిందే అంటూ ద‌ర్శ‌కులు,నిర్మాత‌లు,హీరోల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.ఇప్ప‌టికే క‌స్తూరి,అర్చ‌న‌,గాయ‌త్రి వంటి వారు త‌మ మ‌నోవేధ‌న గురించి మీడియా ముందు చెప్పుకున్న సంగ‌తి తెలిసిందే క‌దా..తాజాగా శ్రీరెడ్డి అనే హీరోయిన్ సైతం ఇండ‌స్ట్రీకి ప‌ట్టిన బూజును వ‌దిలించేందుకు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆమె విప్పిన గుట్టు ఇండ‌స్ట్రీ పెద్ద‌లంద‌రినీ బ‌జారున నిల‌బెట్టేలా చేసింది. హీరో నాని కానుంచి మొద‌లుపెడితే టాప్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా ప్ర‌శ్నించింది. ఆమె ప్ర‌శ్న‌ల్లో వాస్త‌వం ఎంత ఉందో తెలియ‌దు కానీ,యావ‌త్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులంతా ముక్కున వేలేసుకునేలా చేసింది.

 

తెలుగు అమ్మాయిల‌కు ఎందుకు సినీ అవ‌కాశాలు ఇవ్వ‌టం లేదు అన్న‌దే శ్రీరెడ్డి ఆవేద‌న‌. మేం అందంగా ఉండ‌మా..? మాకు యాక్టింగ్ రాదా..? మేం ఎక్స్ పోజింగ్ చేయ‌మా..? మా ద‌గ్గ‌ర లేనిది ఏంటీ,,ఇత‌ర బాష‌ల నుంచి వ‌స్తున్న హీరోయిన్ల వ‌ద్ద ఉన్న‌ది ఏంటి అంటూ క‌డిగిపారేసింది.ఇత‌ర భాష‌ల నుంచి వ‌స్తున్న వారైతే ఆఫ‌ర్ల కోసం దేనికైనా సిద్ధప‌డతారు,కానీ తెలుగు అమ్మాయిలు మాత్రం అందుకు సుముఖంగా ఉండ‌ర‌న్న ఉద్ధేశ్యంతోనే ఆఫ‌ర్లు త‌లుపు త‌ట్ట‌వ‌ని ఆరోపించింది శ్రీరెడ్డి.

ప్ర‌తీ ఇండ‌స్ట్రీలో ఈ స‌మ‌స్య ఉంద‌ని చెప్పిన ఆమె, త‌మిళ ఇండ‌స్ట్రీలో అయితే డెడికేష‌న్ చూపిస్తారా? అని అడుగుతార‌ని, అదే తెలుగులో మాత్రం క‌మిట్‌మెంట్ ఇస్తారా? అని అడుగుతార‌ని, ఆ మాట‌లకి అర్థం ప‌డుకోడానికి సిద్ధ‌మేనా? అని అర్థం చేసుకోవాల‌ని చెప్పింది. ‘‘సినిమా క‌థ చెప్ప‌క‌ముందే, మీరు పడుకోడానికి సిద్ధ‌మేనా… అని ఇన్‌డైరెక్టుగా ప్ర‌శ్నిస్తార‌ని ఆరోపించింది. పోనీలే… అని అవ‌కాశం కోసం అన్ని చంపుకుని ఒప్పుకుంటే చివ‌రికి తెలుగు అమ్మాయిల‌కి ద‌క్కేది చిన్న చిన్న సైడ్ క్యారెక్ట‌ర్లు మాత్ర‌మేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.ఇక‌ ప‌డుకోడానికి ఇష్ట‌ప‌డ‌లేదంటే అవ‌కాశ‌మే ఉండ‌దని చెప్పింది.

హీరో నాని ద‌గ్గ‌రి నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి ప్ర‌తీ స్టార్ హీరోకి ముంబై హీరోయిన్లే కావాలి. లేదా క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళీ అమ్మాయిలు కావాలి.ఎందుకంటే తెలుగు అమ్మాయిలు అయితే క‌మిట్ మెంట్ ఇవ్వ‌ర‌ని,అందుకే ఛాన్స్ ఇవ్వ‌డం లేద‌ని,క‌మిట్ మెంట్ ఇచ్చే ప‌ర‌భాష న‌టీమ‌ణుల‌కే అవ‌కాశాలు ఇస్తున్నార‌ని మండిప‌డింది.
నేనొక సినీ రిపోర్ట‌ర్‌గా, న్యూస్ రీడ‌ర్‌గా కూడా ప‌నిచేశాను. కాబట్టి ఇంత ధైర్యంగా చెబుతున్నారు. మొన్న అర్చ‌న చెప్పింది, అంతకు ముందు రాధిక ఆప్టే చెప్పింది. ఈ మ‌ధ్య‌నే శ్రియ కూడా దీని గురించి మాట్లాడింది… ఎన్ని ప‌క్క‌ల కింద న‌లిగితే సినిమాలొస్తాయో నాకు తెలుసు. ఆఫ‌ర్ల కోసం నా శ‌రీరాన్ని దాచుకోకుండా ఎక్స్‌పోజ్ చేస్తున్నా.

సిగ్గు కూడా వ‌దిలేసి. తిండి తిప్ప‌లు వ‌దిలేసి, వ‌ర్క‌వుట్లు చేసి బాడీని అందంగా మెయింటేన్ చేసేది అవ‌కాశాల కోస‌మే. నిద్ర కూడా వ‌దిలేసి, అవ‌కాశాల కోసం ఎదురుచూస్తూ ఉండాలి. ఇక్క‌డ కాస్ట్ ఆఫ్ లివింగ్ స‌మ‌స్య‌. సాధార‌ణ దుస్తుల్లో క‌నిపిస్తే ప‌ట్టించుకోరు. చెప్పాలంటే ఏడుపొచ్చేస్తుంది… పైకి నీతులు చెప్పే ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారు కూడా ఎంత మంది తెలుగు అమ్మాయిల‌కి ఛాన్సులు ఇచ్చారు. ఎక్క‌డి నుంచో ప్ర‌ణీత లాంటి వాళ్ల‌ని తీసుకొచ్చి, మీరు ఎంక‌రేజ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇక్క‌డ తెలుగు అమ్మాయిలు కూడా బాగా మెయింటెయిన్ చేస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారు ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ గురించి పోరాడుతున్నారు క‌దా! నేను తెలుగు అమ్మాయిలకు అవ‌కాశాల కోసం పోరాడుతా… చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా అంద‌రికీ స‌మంతా, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, కాజ‌ల్ లాంటి వేరు భాష‌ల వాళ్లే కావాలి. లిప్ సింక్ కాక‌పోయినా ప‌ర్వాలేదు. కానీ తెలుగు అమ్మాయిల‌ని ఎందుకు ప‌ట్టించుకోరు…’’ అంటూ తీవ్రంగా మాట్లాడింది శ్రీ‌రెడ్డి. ఆమె వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో పెను సంచల‌నం సృష్టిస్తున్నాయి.