Wednesday, March 27, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

ఎమ్మెల్యే,ఎంపీల‌ స‌స్సెండ్ పై స్పెష‌ల్ రిపోర్ట్…

తెలంగాణ అసెంబ్లీలో గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న వాడీ వేడి తెలిసిందే క‌దా.గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తుండ‌గా కాంగ్రెస్ స‌భ్యులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి త‌న చేతిలో ఉన్న హెడ్ ఫోన్స్ ను విస‌ర‌డంతో అది కాస్తా మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్ కు త‌గ‌ల‌డం,ఆయ‌న కంటికి గాయం కావ‌డంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను అధికార పార్టీ శాశ్వ‌తంగా స‌స్పెండ్ చేయ‌డం ఇదంతా తెలిసిన విష‌య‌మే.అయితే ఈ ఘ‌ట‌న‌లో త‌ప్పెవ‌రిది అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.కోమ‌టిరెడ్డి హెడ్ ఫోన్స్ విస‌ర‌డం వాస్త‌వ‌మే కానీ,అది స్వామిగౌడ్ కు నిజంగా త‌గిలిందా లేదా అన్న వీడియో మాత్రం బ‌య‌టికి రాలేదు.దీంతో స్వామి గౌడ్ తో ప్ర‌భుత్వ‌మే నాట‌కం ఆడిస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.ప్ర‌భుత్వం మాత్రం ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్ గా ప‌రిగ‌ణించి కాంగ్రెస్ స‌భ్యులైన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి,సంప‌త్ కుమార్ ల‌పై శాశ్వ‌త వేటు వేసింది.

అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు గ‌తంలోనూ అనేకం చోటుచేసుకున్నాయి.చ‌ట్ట‌స‌భ‌లు తీసుకున్న నిర్ణ‌యాల‌ను కోర్టులు సైతం స‌మ‌ర్థించాయి.స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా ఎలాంటి చ‌ర్య‌లైనా తీసుకునే నిర్ణ‌యం శాస‌న‌స‌భ‌కు,లోక్ స‌భ‌కు ఉంటుంద‌ని ఆర్టిక‌ల్ 194(3) స్ప‌ష్టం చేస్తున్న నేప‌థ్యంలో, విప‌క్షాలు న్యాయ పోరాటం చేసిన‌ప్ప‌టికీ వృథా ప్ర‌యాసే కానుంది.

ఇందిరా గాంధీపై వేటు…!

దేశ‌ప్ర‌ధానిగా సేవ‌లు అందించిన‌ ఇందిరాగాంధీ సైతం గ‌తంలో చ‌ట్ట‌స‌భ‌ల నుంచి వేటుకు గురైంద‌న్న సంగ‌తి చాలా త‌క్కువ మందికి తెలుసు.1977 న‌వంబ‌ర్ 18న లోక్ స‌భ‌లో ఆమె స‌భా కార్య‌క‌లాపాల‌కు అడ్డుత‌గులుతుందని,రెచ్చ‌గొట్టేలా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని,బెదిరింపుల‌కు పాల్ప‌డుతుంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఇందిరాగాంధీపై వేటు వేశారు.

సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిపై వేటు..
అలాగే, 1976 నవంబర్‌ 15న రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిపై అనుచిత ప్రవర్తన కారణంగా వేటు వేశారు. 1966 ఆగ‌స్టులోను మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇద్ద‌రు స‌భ్యుల‌పై శాశ్వ‌తంగా స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ వేటు వేసింది.ఈ కేసులో వేటుకు గురైన స‌భ్యులు న్యాయ‌పోరాటం చేసినా తీర్పు మాత్రం మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికే అనుకూలంగా రావ‌టం విశేషం.

స్టింగ్ ఆప‌రేష‌న్ బ‌ట్ట‌బ‌య‌లు..

2005లో తెహ‌ల్కా అనే వార్త‌ప‌త్రిక జరిపిన స్టింగ్ ఆప‌రేష‌న్ కార‌ణంగా 11 మంది ఎంపీలు సస్పెండ్ కు గురయ్యారు.లోక్ స‌భ‌లో కొంద‌రు ఎంపీలు అనైతికంగా,చ‌ట్ట‌విరుద్ధంగా లంచం తీసుకోవ‌డంపై ర‌హ‌స్యంగా కెమెరాల‌తో స్టింగ్ ఆప‌రేష‌న్ చేసి ఆజ్ త‌క్ ఛానెల్లో ప్ర‌సారం చేసింది తెహ‌ల్కా ప‌త్రిక‌.దీంతో ఈ కుంభ‌కోణం నేటికీ దేశ పార్ల‌మెంట‌రీ చ‌రిత్ర‌లో ఓ మాయ‌ని మ‌చ్చ‌గా నిలిచిపోయింది.దీనిపై అప్ప‌టి స్పీక‌ర్ సోమ్ నాథ్ ఛ‌ట‌ర్జీ, ప‌వ‌న్ కుమార్ బ‌న్స‌ల్ నేతృత్వంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా ఆ 11మంది ఎంపీల‌ను సస్పెండ్ చేశారు.వీరిలో 6 గురు బీజేపీ ఎంపీలు,ముగ్గురు బీఎస్పీ స‌భ్యులు,ఒక‌రు కాంగ్రెస్,ఒక‌రు ఆర్జేడీ కావ‌టం విశేషం.వీరిపై శాశ్వ‌త వేటు వేసి అనంత‌రం 2006 ఆగ‌స్టులో ఉప ఎన్నిక నిర్వ‌హించారు.అయితే ఈ కేసులోను స‌స్పెండైన ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన‌ప్ప‌టికీ ఫ‌లితం ప్ర‌భుత్వానికి అనుకూలంగానే వ‌చ్చింది.

గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు చేతికి గాయం…

2014లో మ‌హారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళ‌న కార‌ణంగా తోపులాట జ‌రిగి ఏకంగా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు గారి చేతికి గాయం అయింది.అప్పుడు కూడా స‌భ‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించడానికి వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావును అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జరిపిన తోపులాట‌లో మార్షల్స్ అడ్డుకున్న‌ప్ప‌టికీ గ‌వ‌ర్న‌ర్ కు గాయం అయింది.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేసింది ప్ర‌భుత్వం.

స్పీక‌ర్ సురేష్ రెడ్డిపై దాడి…

2008లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒంగోలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన అప్ప‌టి స్పీక‌ర్ సురేష్ రెడ్డిపై ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం అనుచిత వ్యాఖ్య‌లు చేసినందున ఆయ‌న‌పై ఆరు నెల‌ల పాటు స‌స్పెండ్ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది శాస‌న స‌భ‌.

ఏపీలో రోజా కేసు..


ఇక న‌గరి ఎమ్మెల్యే రోజాపై వేటు తెలిసిందే.ఆమె ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందున ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు స్పీక‌ర్.దీనిపై రోజా సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లినా ప్ర‌యోజనం లేదు. స్పీక‌ర్ నిర్ణ‌యానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

విజయ్‌ మాల్యా కేసు..
9400 కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి పారిపోయిన లిక్కర్‌ వ్యాపారి, కింగ్‌ఫిషర్‌ ఏర్‌లైన్స్‌ మాజీ అధినేత విజయ్‌ మాల్యాను రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని శరద్‌యాదవ్‌ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సులు సమర్పించడానికి ఒక రోజు ముందే మాల్యా రాజీనామా చేసేశారు. అయినా ఆయనపై వేటు వేసినట్లే లెక్క అని విచారణ కమిటీ ప్రకటించింది.

కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి,సంప‌త్ కుమార్ ల‌పై వేటు..


తాజాగా తెలంగాణ అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తుండ‌గా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హెడ్ ఫోన్స్ విసిరి మండ‌లి చైర్మ‌న్ స్వామి గౌడ్ కంటికి గాయం చేసినందున స్పీక‌ర్ శాశ్వ‌తంగా స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నాడు.కోమ‌టిరెడ్డితో పాటు సంప‌త్ కుమార్ పై కూడా శాశ్వ‌త వేటు వేసింది ప్ర‌భుత్వం.ఇక ఆలంపూర్,న‌ల్ల‌గొండ అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.