Wednesday, May 23, 2018

నన్ను ఎక్కడపడితే అక్కడ టచ్ చేసారు.. చిన్మయి సంచలన వ్యాఖ్యలు

ప‌లు విష‌యాల‌పై త‌న ఆలోచ‌న‌ల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసే గాయ‌ని చిన్మ‌యి తాజాగా త‌న‌కెదురైన షాకింగ్ ఘ‌ట‌న‌ను వివ‌రించింది. ఇటీవ‌ల హాజ‌రైన ఓ కార్య‌క్ర‌మంలో త‌న‌కు ఎదురైన అనుభవాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. `ఇటీవ‌ల ఓ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యా. అక్క‌డ నా చుట్టూ చాలా మంది చేరారు. ఆ గుంపులోని ఓ వ్య‌క్తి తనతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పింది. ఆ వ్యక్తి అసభ్యంగా తన చేతితో తాకాడు` అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది.

ఆ త‌ర్వాత చిన్న‌వ‌య‌సులో బాల‌లు లేదా బాలిక‌ల‌కు ఎదురయ్యే ఘటనల గురించి వరుస ట్వీట్లు చేసింది. `ఉపాధ్యాయ‌లు, సోద‌రులు, అంకుల్స్‌, ఆంటీలు, స‌హ ప్ర‌యాణీకులు.. ఇలా అంద‌రి చేతుల్లో బాల‌బాలిక‌లు అసభ్య ప్రవర్తనకు  లోను అవుతున్నారని చెప్పింది . తమకు జరిగిన అనుభవాల  గురించి చెప్తే కొంత‌మంది మాత్రమే నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  బాల‌బాలిక‌లు త‌మ‌పై జ‌ర‌గుతున్న అసభ్య ప్రవర్తన తో  ఎంజాయ్ చేస్తార‌ని కొంత‌మంది పెద్ద‌లు చెబుతుండ‌డం సిగ్గుచేట‌`ని చిన్మ‌యి తెలిపారు.