Monday, March 25, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

దేశంలోనే ధ‌నిక ఎంపీ ఎవ‌రో తెలుసా..? క‌ళ్లు చెదిరే ఆస్తులు..

సాధార‌ణంగా ఆస్తులు ఎవ‌రికి ఎక్కువ‌గా ఉంటాయ‌ని ప్ర‌శ్నిస్తే మీరు ఎవ‌రి పేరు చెబుతారు..? బిజినెస్ చేసే వారి ద‌గ్గ‌ర‌నా,రాజకీయాలు చేసే వాళ్ల వ‌ద్ద‌నా, సినిమాలు నిర్మించే వాళ్ల పేర్లా…ఎక్కువ‌గా అయితే ఈ మూడు రంగాల వారి వ‌ద్దే డ‌బ్బులు ఎక్కువగా ఉంటాయి.కాక‌పోతే వారి ఆస్తుల‌ను ఎవ‌రూ బ‌య‌ట‌కి చెప్పుకోక‌పోయినా,రాజ‌కీయ నాయ‌కుడి ఆస్తులు మాత్రం ఎప్పుడో ఒక‌సారి చెప్పుకోక త‌ప్ప‌దు.ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సి వ‌చ్చిన సందర్భంలో ఎన్నిక‌ల అఫిడవిట్ లో త‌ప్ప‌కుండా త‌మ ఆస్తుల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు అంద‌జేయాల్సి ఉంట‌ది..

అయితే,ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగతి తెలిసిందే క‌దా.ఈ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్న జ‌యా బ‌చ్చ‌న్ ఆస్తులు కూడా బ‌య‌టికొచ్చాయి.ఆమె తాజాగా స‌మాజ్ వాదీ పార్టీ త‌రపున రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ దాఖ‌లు చేసింది.ఇందుకోసం ఆమె ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పేర్కొన్న ఆస్తుల వివ‌రాలు చూస్తే క‌ళ్లు తిరగాల్సిందే.ఎందుకంటే ఇప్పుడు దేశంలోనే ధ‌న‌వంతులైన ఎంపీ ఎవ‌రు అంటే జ‌యాబ‌చ్చ‌న్ యే కాబ‌ట్టి..

ఇప్ప‌టివ‌ర‌కు రిచెస్ట్ ఎంపీగా ఉన్న ర‌వీంద్ర కిశోర్ సిన్హాను మించి జ‌యా బ‌చ్చ‌న్ తన ఆస్తుల‌ను ప్ర‌క‌టించింది.మొత్తం 1000 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లుగా అఫిడ‌విట్ లో చూపిన జ‌యా, అందులో 460 కోట్ల స్థిరాస్తులు కాగా,540 కోట్ల చ‌రాస్తులు ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

2012లో కేవ‌లం 460 కోట్లు మాత్ర‌మే ఉన్న ఇస్తులు ఇప్పుడు 2018 వ‌చ్చేసరికి అంటే కేవ‌లం 6 ఏళ్ల‌లోనే వారి ఆస్తుల విలువ రెట్టింపు అయింద‌న్న‌మాట‌. ఇక 1000 కోట్ల ఆస్తుల్లో అమితాబ్ బ‌చ్చ‌న్, జ‌యా బ‌చ్చ‌న్ ల‌కు క‌లిపి మొతం అత్యంత విలువైన 12 కార్లు ఉన్న‌ట్లు పేర్కొంది.ఇక అమితాబ్ ఆభ‌రణాల విలువ కోట్లు కాగా,జ‌యా బ‌చ్చ‌న్ ఆభ‌రణాల విలువ 26 కోట్లు ఉన్న‌ట్లుగా పేర్కొన్నారు.అలాగే దంపతులిద్ద‌రి ద‌గ్గ‌ర క‌లిపి 5 కోట్ల విలువైన చేతి గడియారాలు ఉన్న‌ట్లుగా అఫిడ‌విట్లో వెల్ల‌డించారు.ఇక‌, అమితాబ్‌ పేరుమీద ఒక ట్రాక్టర్‌, నానో కారు కూడా ఉన్నట్లు చెప్పుకున్నారు. బిగ్‌ బీ దగ్గరున్న రూ.9 లక్షల పెన్నును కూడా అఫిడవిట్‌లో పొందుపర్చారు. వీరికి ఫ్రాన్స్‌లోని బ్రిగ్‌నోగన్‌లో 3,175 చదరపు మీటర్ల నివాస స్థలం ఉంది. భారత్‌లోనైతే నోయిడా, భోపాల్‌, పుణె, అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, ముంబై, లక్నోల్లో స్థలాలున్నాయి.