Monday, September 24, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

జూనియర్ ఎన్టీఆర్ సినిమా లో ప్రియా వారియార్

ఒకే ఒక్క వీడియో తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యిన నటి ప్రియా వారియర్. ఇక్కడ చూసినా ఆమె చేసిన వీడియో పట్ల స్పందన ఆ స్థాయిలో ఉంది మరి. ఒకే ఒక్క రోజులో సన్నీ లియోన్ ని దాటేసి  మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ప్రియా వారియర్ ఇప్పుడు అందరికీ hot టాపిక్. అయితే ప్రియా వారియర్ తో సినిమా చేయాలని ఉబలాటపడుతున్న వారిలో కుర్ర హీరోల నుండి స్టార్ హీరోల దాకా ఉంది లిస్టు.

వీరిలో అల్లు అర్జున్ ఓపెన్ గానే ఈ అమ్మడు  కి ఫిదా అయిపోయినట్టు ఒప్పుకోగా , మిగతా హీరోలు కూడా ఆమె మీద స్పూఫ్ లు చేసారు. అయితే అయితే ప్రస్తుతం ఆ భామ తన జీవితంలో కనీ వినీ ఎరుగని అదిరిపోయే ఆఫర్ ని సంపాదిచినట్టు సమాచారం.

ప్రియా వారియర్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. అయితే ఆమె జత కట్టబోతున్నది యంగ్ టైగర్ తో కాదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా రీమేక్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు విడుదల అయిన టెంపర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృస్తించిందో తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో ఎన్ టీఆర్ నట విశ్వరూపం చూపించడంతో ఒక్క సారిగా అతని మార్కెట్ పూర్తిగా పెరిగిపోయింది. ఆ తరువాత హిట్ బాట పట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు సినిమాలోని టాప్ హీరోలలో ఒకడిగా పేరు తెచ్చుకున్న వైనం మనకు తెలిసిన విషయమే.

అయితే తాజాగా ఈ సినిమాని బాలీవుడ్ లో తీద్దామని ఫిక్స్ అయ్యారంట సదరు నిర్మాతలు. అనుకున్నదే తడవుగా , రోహిత్ శెట్టి ఈ సినిమాకు స్క్రిప్ట్ ని గత సంవత్సర కాలంగా తయారు చేసుకున్నారంట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని చాలా కాలం పాటు తర్జనబర్జన జరిగాక, ఇప్పుడు ప్రియా వారియర్ పేరు బయటికి వచ్చింది. రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే ప్రియా వారియర్ ని ఈ విషయం పై సంప్రదించినట్టు వార్తలు బయటికి వచ్చాయి.

అయితే ఈ విషయం పై మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆమె బదులు ఇస్తూ ” రణవీర్ సింగ్ కి నేను పెద్ద అభిమానిని , అందుకే అతనితో కలిసి పని చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా అని వెల్లడించింది.