Monday, September 24, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

షాకింగ్: ప్రముఖ హీరోయిన్ భారీ మోసం.. అరెస్ట్ కి రంగం సిద్దం

హీరోయిన్ సింధు మీనన్‌ ఈ పేరు అందరికీ సుపరిచితమే.. చందమామ, వైశాలి, భద్రాచలం, త్రినేత్రం, శ్రీరామచంద్రులు, ఇన్‌స్పెక్టర్‌తో పాటు పలు సినిమాలతో తెలుగులో నటించి మెప్పించింది. కాగా బ్యాంకు నుంచి నకిలీ పత్రాల ద్వారా భారీ స్థాయిలో అప్పు చేసి.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించని వ్యవహారంతో వార్తల్లోకి వచ్చింది సింధూమీనన్. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ నటించిన మలయాళీ భామ అరెస్టుకు కూడా ఇప్పుడు ప్రయత్నాలు సాగుతూ ఉండటం గమనార్హం.

అసలేం జరిగిందంటే.. బ్యాంక్ ఆఫ్ బరోడా బెంగళూరు శాఖ ఒక దాని నుంచి సింధూ మీనన్, ఆమె సోదరులు ముప్పై ఆరు లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నారట. దీనికి పూచికత్తుగా సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న ఆస్తులు ఏవీ వాస్తవంలో లేవని బ్యాంకు అధికారులు గుర్తించారు. ఆమె నకిలీ డాక్యుమెంట్స్ ను సమర్పించి.. అప్పు తీసుకుందని తెలుస్తోంది. ఈ మొత్తంతిరిగి చెల్లించకపోవడంతో.. అసలు కథ మొత్తం వెలుగులోకి వచ్చింది.

నకీలీ పత్రాలతో మోసం 

నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందడంతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సింధు మీనన్‌తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జ్యుబిలెంట్‌ మోటార్స్‌ వక్ఫ్‌ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్‌ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌ నుంచి మీనన్‌ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. ఆమె రుణం కోసం సమర్పించిన పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంక్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీనన్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించినా.. ఆమె విదేశాల్లో ఉండటంతో వీలుకాలేదు. మీనన్‌ సోదరుడు కార్తికేయన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.