Monday, September 24, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

ఎవరికీ సాధ్యం కానీ రికార్డు సాధించిన నారా రోహిత్

తెలుగు సినిమా హీరోల్లో నారా రోహిత్ ది ప్రత్యేకమైన స్థానం. ఆయన నటించిన సినిమాలు అన్నాయి దాదాపుగా ఆఫ్ బీట్ చిత్రాలే. ఇంకో రకంగా చెప్పాలి అంటే సమకాలీన హీరోల్లో నారా రోహిత్ చేసినన్ని ప్రయోగాత్మక పాత్రలు ఇంకెవ్వరూ చేసి ఉండారు అంటుంటారు. మొదటి సినిమా బాణం నుండి మొన్న వచ్చిన అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమా దాకా అతని శైలి అదే. ప్రస్తుతం అతను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డు ఒకటి సొంతం చేసుకోబోతున్నాడు.

వారసుడు అయినా :

నిజానికి ఇప్పుడు వస్తున్న వారసులు అందరూ కూడా , కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులని ఆదరించడానికి సిద్ధం అవుతున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది మాస్ మసాలా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు . ఇక నారా రోహిత్ విషయానికి వస్తే అతని పెదనాన్న ఒక రాష్ట్రానికే సీఎం. ఆయన కావాలంటే పెద్ద దర్శకుడులు ఎవరితోనైనా సినిమా చెయ్యొచ్చు. కానీ , అతను అలంటి దారిని ఎంచుకోలేదు. ప్రతీ సినిమాలో ఇప్పటిదాకా రాని ఒక కొత్తదనం ఉన్న కథని ఎంచుకుని ముందుకు పోతున్నాడు. అందుకే సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా మంచి ఫాన్ బేస్ ని సంపాదించుకుని సినిమాలు చేస్తున్నాడు.

ప్రత్యేకమైన పాత్ర :

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తున్న టాక్. నారా రోహిత్ చేస్తున్న తదుపరి సినిమాలో పాత్ర గురించే. ఈ సినిమాలో అతనిది మూగ పాత్ర. ఇంతక ముందు ఎందరో హీరోలు అలంటి పాత్రలతో సినిమాలు చేశారు కానీ,  ఏకంగా  సినిమాలో పూర్తి స్థాయి మూగవాడిగా కనిపించే సాహసం ఎవ్వరూ చెయ్యలేదు. ట్రెండ్ ప్రకారం చూస్తే ఇది చాలా పెద్ద సాహసమే. దానికి తోడు , వరుసపెట్టి వచ్చిన ఫ్లాపులతో దాదాపుగా కనుమరుగు అయ్యే పరిస్థితిలో ఉన్న నారా రోహిత్ ఒక్క సారిగా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం పై అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటిదాకా 18 సినిమాలు చేసిన నారా రోహిత్ కి ఇది మోస్ట్ చాలెంజింగ్ సినిమానే.

ఉగాదికి :

ఈ సినిమాకి  పీ.బీ.మంజునాథ్ దర్శకుడు. నారాయణ రావు అట్లూరి ఈ సినిమా కి నిర్మాత. ఈ సినిమా కి వికాస్ కురుమెళ్ళ సంగీతాన్ని అందించనుండగా , ప్రసాద్స్ రిచర్డ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఉగాది రోజున ప్రారంభం అవ్వబోతున్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వాల్సి ఉంది. హీరోయిన్ ల విషయంలో ఇంకా పేరు బయటికి రాలేదు.