Saturday, June 23, 2018

రారా మూవీ రివ్యూ &రేటింగ్..!!

చాలా రోజుల నుంచి సక్సెస్ రుచి చూడని శ్రీకాంత మళ్లి ఒక కొత్త ప్రయత్నం తో మన ముందుకు వచ్చారు. ఇతర హీరోల  సినిమాలలో హీరో గా నటిస్తూ తన సినీ జీవితం కొనసాగిస్తున్న ఆయన మరొక సారీ తన అదృష్టం పరీక్షించు కోవడానికి హారర్ కధాంశం తో మన ముందుకి వచ్చేసారు ఎంతో మందికి సక్సెస్ మంత్ర గా ఉన్న హారర్ సినిమా లు మన శ్రీకాంత గారికి ఎలాంటి పలితాన్ని ఇచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం రండి.

తారాగణం : శ్రీకాంత్, నజియ, అలీ

నిర్మాణం  :- విజయ్

దర్శకత్వం : శ్రీకాంత్, విజిచేరీష్

సంగీతం :- షకీల్

కథ :

శ్రీకాంత్ తన మొత్తం సినిమా జీవితంలో ఎప్పుడూ హారర్ సినిమా లు తీయలేదు అలంటి శ్రీకాంత హారర్ కాన్సెప్ట్ తో సినిమా వస్తుంది అంటే అంచనాలు బాగానే ఉంటాయి. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా లో శ్రీకాంత సినిమాల మీద బాగా ఇష్టం ఉంది ఒక గొప్ప డైరెక్టర్ అవ్వాలనుకునే వ్యక్తి. తక్కువ బడ్జెట్ తో ఒక మంచి హారర్ సినిమా తీయాలని శ్రీకాంత్ ప్రొడ్యూసర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే అనుకోని విధంగా ఒక ఒక వ్యాపార వేత్త తో సినిమా తీయడానికి శ్రీకాంత్ ఒప్పుకుంటాడు. అయితే వరంగల్ దగ్గరలోని కామాపురం అనే చోట ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ నటి నటులతో షూటింగ్ కోసం వెళ్తాడు అయితే అక్కడే వీళ్ళకి దెయ్యాలు కనిపించడం మొదలు అవుతుంది. అయితే మొదట్లో వాటిని చూసి అందరు బయపడతారు కాని వాటితోనే వాళ్లు సినిమా తీస్తారు. దెయ్యలతో సినిమా ఎలా తీసారు చివరికి ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కధాంశం.

టెక్నిషియన్స్ : 

ఇందులో ఉన్న నటులు అందరు తమ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది. సాంకేతికం గా చాలా ఉన్నతం గా ఉన్న ఈ సినిమాకి, నిర్మాణ విలువలు కూడా బానే ఉన్నాయంటున్నారు. కొత్త దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్  చక్కగా డీల్ చేసాడని సమాచారం. శ్రీకాంత్ యాక్టింగ్  ఈ చిత్రానికి ఎడ్వాంటేజ్ గా తెలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా కి మేజర్ హైలైట్ గా  తెలుస్తుంది.

ప్లస్ పాయింట్స్ :- 

  1. శ్రీకాంత్
  2. స్టొరీ
  3. స్క్రీన్ ప్లే
  4. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :-

1) స్లో సినిమా

ఫలితం : శ్రీకాంత్ నటిస్తూ తానే డైరెక్ట్ చేసిన ఈ సినిమా శ్రీకాంత కి పెద్దగ సక్సెస్ ఇవ్వలేదనే చెప్పొచు.

రేటింగ్:- 2.5/5