Monday, March 25, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

స్కెచ్ సినిమా రివ్యూ &రేటింగ్

ఏ  సినిమా అయినా సరే వైవిధ్యమైన పాత్రలతో అందరినీ ఆకట్టుకునే , తమన్నా తో కలిసి విజయ్ చందర్ దర్శకత్వంలో నటించిన స్కెచ్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. అంతగా బజ్ క్రియేట్ చెయ్యకపోయినా మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు సంబంధించి ఒపీనియన్ ఎలా ఉందొ ఒక సారి చూద్దాం.

తారాగణం : విక్రమ్ , తమన్నా, రాధారవి , హరీష్ పేరడి , ఆర్.కె. సురేష్,

దర్శకత్వం : విజయ్ చందర్

సంగీతం : యస్.యస్. థమన్

కెమెరా : యం . సుకుమార్

ఎడిటింగ్ : రూబెన్

కథ ఏంటి ?

లోకల్ రౌడీ అయిన స్కెచ్ సరదాగా తన ముగ్గురు స్నేహితుల గ్యాంగ్ లతో తిరుగుతూ , అప్పుడప్పుడు దొంగతనాలు , వార్ణింగ్ లు లాంటి పని చేస్తూ సరదాగా గడిపేస్తుంటారు. అతనికి అగ్రహారం అమ్మాయి అయినా అమ్ము పరిచయం అవుతుంది. చూడగానే ఆమెతో ప్రేమలో పడిన స్కెచ్ నెమ్మదిగా ఆమె వెంట పడుతుంటాడు. అతనితో పడని వారందరూ చెప్పిన మాట విని అమ్ము అతన్ని అసహ్యించుకుంటుంది. కానీ , తరువాత అర్ధం చేసుకుని ప్రేమించడం మొదలుపెడుతుంది. ఐతే , ఇంతలో స్కెచ్ గ్యాంగ్ లో ఒకళ్ళ తరువాత ఇంకొకళ్ళు చనిపోతూ ఉంటారు.

ప్లస్సులు :

విక్రమ్ నటన

థమన్ సంగీతం

తమన్నా పాత్ర తీరు

క్లైమాక్స్ ట్విస్ట్

కొన్ని యాక్షన్ సన్నివేశాలు

మైనస్సులు :

అస్సలు బాగోని కామెడీ

మామూలు స్టోరీ

బోరు కొట్టే ప్రేమ కథ

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో విక్రమ్ కాకుండా జనాలని సీట్ లో కూర్చొఎత్తిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది థమన్ అనొచ్చు. చాలా రోజుల తరువాత చెప్పుకోతగ్గ పాటలు, సంగీతం అందించాడు ఈ సినిమా కి. ఒక్క సారిగా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అనుకోవచ్చు. ఇకపోతే సినిమాటోగ్రఫీ . గొప్పగా ఉంది అనలేము కానీ, సినిమాకి తగ్గట్టు ఉంది. ఎడిటింగ్ విషయానికి వస్తే స్కెచ్ స్కెచ్ అని అంటామే కానీ, సినిమాకి కావలసిన జడ్జ్మెంట్ పూర్తిగా దారితప్పింది ఎడిటింగ్ లొనే, అక్కడ కూడా సస్పెన్స్ అన్నది అనిపించకుండా చాలా సాదాసీదాగా పని చేసిన డిపార్ట్మెంట్ ఇది. ఇక పాటల చిత్రీకరణ విషయానికి వస్తే ఎప్పుడు ఏ పాట వస్తుందో అర్ధం కాదు. అస్సలు అతకకుండా పాటలని సినిమాలోకి చొప్పించారు. సినిమాలో సహజత్వం ని ప్రతిఫలించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ పని చేసిన తీరుని మెచ్చుకోవచ్చు.

అనాలసిస్ :

అందమైన ట్విస్టులతో తీసిన ఈ సినిమా మొదటి నుండి బాగానే ఆసక్తి రేకెత్తిస్తుంది. సినిమా ఆద్యంతం ఒక పక్కన మాంచి సీన్ వచ్చింది అనుకునే టైం లోపలే రొట్ట రొటీన్ వచ్చి మన మీద పడుతూ ఉంటుంది. ఒక పక్క విక్రమ్ యాక్షన్ సన్నివేశంలో రెచ్చిపోయాడు అనుకునే లోపల , బోర్ కొట్టే కామెడీ ట్రాక్ ఓ , లేదా తమన్నా లవ్ ట్రాక్ ఓ వస్తుంది.మొదటి భాగం అంటా బోర్ గా నడిచే ఈ సినిమాలో రెండవ భాగం నుండి ఆసక్తి నెలకొంటుంది. ఆ ఆసక్తిని కాస్త మైంటైన్ చెయ్యడం వలన సినిమా కాస్త అన్నా బాగుంది అన్న ఫీలింగ్ తో బయటికి వస్తాం. ముఖ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. ఆలోచింపచేసే చిత్రం గా ఈ సినిమా ఎండ్ అవుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఒక మంచి కారుని రేసులో పెట్టి అనవసరంగా గతుకుల రోడ్డులో పోనిస్తే ఏమవుతుందో ఈ సినిమాని చూస్తే అర్ధం అవుతుంది.

ఫైనల్ గా : బాగా ఓపిక ఉండాలి. కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రం హృదయాన్ని తాకుతాయి

రేటింగ్ : 2.25/5