Wednesday, March 27, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

ప్ర‌ధాని రేసులో కేసిఆర్…త‌ల ప‌ట్టుకుంటున్న చంద్ర‌బాబు…?

కేసీఆర్ వ్యాఖ్య‌లతో బాబు అంత‌ర్మ‌థ‌నం…?

కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నుకుంటున్నారా… ఉన్న‌ట్టుండి ఆయ‌న పేల్చిన బాంబు దేశ‌రాజ‌కీయాను క‌దిలించ‌నుందా… చంద్ర‌బాబు క‌న్నా తానేం త‌క్కువ కాద‌ని నిరూపించుకోబోతున్నాడా.. రాహుల్ గాంధీ వీక్ నెస్,న‌రేంద్ర‌మోడీ స్ట్రాంగ్ నెస్ పై కేసీఆర్ దెబ్బ కొట్ట‌బోతున్నాడా.. ప్ర‌ధాని ప‌ద‌విపై క‌న్నేశాడా… ఇలా అనేక అనుమానాల‌కు కేసిఆర్ ప్రెస్ మీట్ చెక్ పెట్టిన‌ట్లే క‌నిపిస్తోంది…

ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా న‌రేంద్ర‌మోదీకి ఉన్న బ‌లాన్ని, అదే బ‌లంతో దెబ్బ తీయాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. గుజ‌రాత్ సీఎంగా చేసిన న‌రేంద్ర‌మోదీ ఏకంగా దేశానికే ప్ర‌ధాన‌మంత్రి అయ్యాడు.ఇప్పుడు అదే పంథాలో కేసీఆర్ సైతం తెలంగాణ సీఎం నుంచి భారత ప్ర‌ధాని ప‌ద‌విపై క‌న్నేసిన‌ట్లు క‌నిపిస్తుంది. న‌రేంద్ర‌మోదీని గాడు అని సంబోధించిన కేసీఆర్,, ఆ మాట అన‌లేద‌ని గారు అని ప్ర‌స్తావిస్తే దాన్ని మీడియా వ‌క్రీక‌రించింద‌ని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు.. రాజ్యంగంలో ప్ర‌ధానిని విమ‌ర్శించ‌కూడ‌ద‌ని ఎక్క‌డా లేద‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇక ప్ర‌స్తుతం దేశంలో కాంగ్రెస్ తో పాటు,బీజేపీ కూడా విఫ‌లం అయింద‌ని చెప్పిన కేసిఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని,అవ‌స‌ర‌మైతే తానే దానికి నేతృత్వం వ‌హిస్తాన‌ని, 64 ఏళ్ల వ‌య‌సున్న తాను దేశ ప్ర‌ధాని అయ్యేందుకు బాట‌లు వేస్తాన‌ని అన్నాడు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాల‌కు నిధులు ఇవ్వాల్సిందేన‌ని, ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తాన‌న్న మోదీ మోసం చేస్తున్నాడ‌ని చెప్పాడు.ఇక తెలంగాణ‌కు కూడా అన్యాయం జ‌రుగుతుంద‌ని, న్యాయం జ‌ర‌గాలంటూ ప్ర‌త్యేక ఉద్య‌మం స్టార్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అది త‌న‌తో అయినా మొద‌లు కావ‌చ్చ‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.

ఇప్ప‌టికే, కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీతారం ఏచూరితో చ‌ర్చ‌లు జ‌రిపాన‌ని, త‌న‌తో క‌లిసొచ్చే పార్టీల‌తో థ‌ర్డ్ ఫ్రంట్ కానీ,మ‌రో ఫ్రంట్ కాని ఏర్పాటు చేసేందుకు క‌స‌ర‌త్తులు ఊపందుకున్నాయ‌ని తెలిపాడు.అయితే గ‌త కొద్దికాలంగా బీజేపీతో అంటీముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా పావులు క‌దుపుతున్నాడు.అంత‌కన్నా ముందే తానే రంగంలోకి దిగి ఆ ఫ్రంట్ కు నేతృత్వం వ‌హించి జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాల‌ని కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్లు ఆయ‌న మాట‌ల‌ను బట్టి తెలుస్తుంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అత్యంత పెద్ద పార్టీగా టీఆర్ఎస్ ను నిల‌బెట్టిన కేసీఆర్, రాబోయే కాలంలో ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి పోటీప‌డే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఎలాగు త‌న‌యుడు కేటీఆర్ పాల‌న‌లో తండ్రికి మించిన నేత‌గా దూసుకుపోతున్నందున కేటీఆర్ కు రాష్ట్ర ప‌గ్గాలు(సీఎం బాధ్య‌త‌లు) అప్ప‌గించి తాను దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు వ్యూహాలు ర‌చిస్తున్ట్లుగా అర్థం అవుతోంది.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీపై త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చిన కేసీఆర్, ఏకంగా దేశంమొత్తం ఆలోచ‌న‌లో ప‌డేవిధంగా ప్రెస్ మీట్లో మాట్లాడాడు. తాను త‌లుచుకుంటే సాధించ‌లేనిదంటూ ఏదీ లేద‌ని అవ‌స‌ర‌మైతే మోదీని గ‌ద్దెదింప‌టం పెద్ద ప‌నేమి కాద‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశాడు. ఇక ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా మోదీ గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని జాతీయ మీడియా స‌ర్వేలు చెప్తున్న నేప‌థ్యంలో దాన్ని అనువుగా మ‌లుచుకునేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలోనే త‌న‌కు అందివ‌చ్చిన ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని త్యాగం చేశాన‌ని చెప్తున్న చంద్ర‌బాబు ఈసారి అన్ని పార్టీల‌ను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తానే ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా రేసులో నిల‌వాల‌ని భావిస్తున్నాడు. దీన్ని గ‌మ‌నించిన కేసిఆర్ అంత‌కంటే ముందే మేల్కొని, థ‌ర్డ్ ప్రంట్ ఏర్పాటుకు క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయంటూ కుండ‌బ‌ద్దుల కొట్ట‌డం, తానే ఆ ఫ్రంట్ కు నేతృత్వం వ‌హిస్తానంటూ ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే చంద్ర‌బాబుకు చెక్ పెట్టి ప్ర‌ధాని రేసులో ముందంజ‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది.

మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ఎత్తుగ‌డ‌లు చూస్తుంటే దేశ రాజ‌కీయాల‌న్నీ రాబోయే రోజుల్లో చంద్ర‌బాబు,కేసీఆర్ చేతుల్లోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబును ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి తృతీయ ఫ్రంట్ ను తీసుకురావాల‌ని ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌తిపాద‌న‌లు షురూ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు దేశ‌రాజ‌కీయాల్లో ప‌లు ప్ర‌కంప‌న‌లకు తావిచ్చేలా ఉన్నాయని అంటున్నారు రాష్ట్ర రాజ‌కీయ నిపుణులు.చూడాలి మ‌రి,ప్ర‌ధాని ప‌ద‌వి తెలుగు నేత‌ల‌కు ఏ మేర‌కు వ‌రిస్తుందో…