Wednesday, March 27, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

కేసీఆర్ ప్ర‌ధాని కావ‌టం అంత ఈజీనా..?

కేసీఆర్ ఓ నిర్ణ‌యం తీసుకున్నాడంటే దాని వెన‌క బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంట‌ది.అది ఏ కార‌ణ‌మైనా కావ‌చ్చు కానీ దాన్ని సాధించే వ‌ర‌కు విడిచిపెట్ట‌డ‌న్న సంగ‌తి తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించి, 13 ఏళ్ల పాటు నిర్విరామంగా ప్ర‌త్యేక రాష్ట్ర‌మే ల‌క్ష్యంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా ఆఖ‌రికి, ప్రాణత్యాగానికి సిద్ధ‌మై ఆమ‌ర‌ణ దీక్ష‌కు పూనుకుని రాష్ట్రం సిద్ధించే వ‌ర‌కు ఉద్య‌మాన్ని కొన‌సాగించాడు. ఆయ‌న ఫ‌లిత‌మో,లేక అంద‌రి స‌హ‌కార‌మో గానీ మొత్తానికి తెలంగాణ ఆవిర్భ‌వించింది.

కొత్త‌గా పుట్టిన రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తానే ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు భుజాల మీద వేసుకుని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాడు.ఇక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయంటే అది స‌హ‌జం.ఎంత మొన‌గాడు సీఎంగా ఉన్నా ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి కాస్తో కూస్తో విమ‌ర్శ‌లు రావ‌డం త‌ప్ప‌నిస‌రి.ప్ర‌స్తుతం కేసీఆర్ పై కూడా అంతే స‌హ‌జంగా వ‌స్తూనే ఉన్నాయి.కానీ వాటిని ప‌ట్టించుకోకుండా త‌న‌దైన స్టైల్లో రాష్ట్రాన్ని న‌డిపిస్తున్నాడు.ఇప్ప‌టివ‌ర‌కైతే గ‌త ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో మెజార్టీ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూనే ఉన్నాడు.మేనిఫెస్టోలో పొందు ప‌ర‌చని ప‌థ‌కాల‌కు కూడా శ్రీకారం చుట్టి పేద‌ల‌ను,ప్ర‌జ‌ల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు కేసీఆర్.ఇక కొన్ని హామీల‌ను మాత్రం ఇంకా ప్రారంభించ‌లేదు.యావ‌రేజ్ గా తీసుకుంటే గ్రామ‌స్థాయికి వెళ్లి కేసీఆర్ ప్ర‌భుత్వ తీరుపై ప్ర‌శ్నిస్తే 70 శాతం మంది కేసీఆర్ కు అనుకూలంగానే మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు ఓ జాతీయ స్థాయి స‌ర్వేలో తేలింది.

 

అయితే, ఉన్న‌ట్టుండి కేసీఆర్ దేశ‌రాజ‌కీయాల్లోకి వెళ్తానంటూ ప్ర‌క‌ట‌న చేయ‌డం వెన‌క ఆయ‌న‌కున్న న‌మ్మ‌కాన్ని మెచ్చుకోవాల్సిందే.ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా మొద‌టిసారి ప‌నిచేస్తున్న కేసీఆర్ కు పాల‌న అంటే ఇది, ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చ‌డ‌మెలా, అస‌లు ఓ రాష్ట్ర‌మే ఇలా ఉంటే,దేశాన్ని ఇంకెంతలా మార్చవ‌చ్చ‌న్న ఆలోచ‌న ఆయ‌న‌కు త‌ట్ట‌డం వెంట‌నే ఆ విధంగా ప్ర‌క‌ట‌న చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.ప్ర‌స్తుతం దేశంలో రెండే రెండు పెద్ద పార్టీలు.ఒక‌టి కాంగ్రెస్,మ‌రొక‌టి బీజేపీ. ఏండ్ల‌కొద్ది ఎన్నిక‌లు వ‌స్తూనే ఉన్నాయి, ఈ రెండు పార్టీలు దేశాన్ని ఏలుతూనే ఉన్నాయి.కానీ గుణాత్మ‌కమైన మార్పు మాత్రం రావ‌టం లేద‌నేది కేసీఆర్ ఆవేద‌న‌.అందుకే ఆయ‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

బీజేపీకి వ్య‌తిరేక‌మైన పార్టీల‌న్నింటినీ కూడ‌గ‌ట్టేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తుంది.ద‌క్షిణాది పార్టీల అధినేత‌ల‌తో కేసీఆర్ మంచి స‌త్సంబంధాలే ఉన్నాయి.ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల‌న్నింటినీ ఒక గొడుగు కింద‌కి రావాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో హంగ్ ఏర్ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్నందున అదే జరిగితే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ చ‌క్రం తిప్పొచ్చ‌ని కూడా కేసీఆర్ అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.ఇక రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం అసాధ్యం.అందుకే కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు నేతృత్వం వ‌హించి ప్ర‌ధాన‌మంత్రి అవ్వ‌గ‌ల‌డేమో..ఎవ‌రికి తెలుసు.

దేశ‌వ్యాప్తంగా మ‌హామ‌హా నాయకులు ఉన్న‌ప్ప‌టికీ,టీఆర్ఎస్ క‌న్నా పెద్ద పార్టీలు అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ చేసేంత సాహసం మ‌రెవ‌రూ చేయ‌లేర‌నేది వాస్త‌వం.ఆయ‌న త‌లుచుకుంటే దిగి రానిదంటూ ఏదీ లేదు.కాబ‌ట్టి కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను త‌క్కువ అంచ‌నా వేసే ప్ర‌స‌క్తే లేదు. ఎన్డీయే బ‌లంగా ఉన్నా,యూపీఏ ఆద‌ర‌ణ పెరుగుతున్నా థ‌ర్డ్ ఫ్రంట్ పుట్టుకొస్తే అవ‌న్నీ త‌ల‌కిందులు అయ్యే ఛాన్స్ లేక‌పోలేదంటూ ప‌లువురు మేధావులు సైతం అభిప్రాయ ప‌డుతుండ‌టం విశేషం.

ఇక ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి కోస‌మే ఆయ‌న ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నాడ‌ని కూడా చెప్ప‌డానికి లేదు.ఎందుకంటే దేశంలో గుణాత్మ‌క మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మాత్ర‌మే కేసీఆర్ చెప్పుకొచ్చాడు. ఆ మార్పు కోసం తాను సైతం ముంద‌డుగు వేసేందుకు సిద్దం అంటూ ప్ర‌క‌ట‌న చేశాడే త‌ప్పా ఎక్క‌డా ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి కోస‌మే త‌న ప‌య‌న‌మ‌ని చెప్ప‌లేదు.ఇక ఏదేమైనా,ద‌క్షిణ భార‌త‌దేశానికి అన్యాయం జ‌రుగుతుంది మ‌హా ప్ర‌భో అంటూ ద‌శాబ్దాల కాలంగా అరుస్తున్నా ప‌ట్టించుకునే నాథుడే లేడు. అదే ఒక‌వేళ కేసీఆర్ పీఎం అయితే ఇక ఆ లోటు తీర్చిన‌ట్ల‌వుతుంది.మ‌న తెలుగోడు మ‌ళ్లీ ప్ర‌ధానిగా చ‌రిత్ర‌కెక్కిన‌ట్లూ అవుతుంది…క‌దా…