Wednesday, December 12, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

జబర్దస్త్ షూటింగ్ సెట్ లో ఘోర ప్రమాదం ! త్రుటిలో తప్పించుకున్న సుడిగాలి సుదీర్

తెలుగు వారందరూ ఇష్టం గా చూసే షో జబర్దస్త్ ప్రోగ్రాం. అక్కడక్కడా వెకిలి హాస్యంతో వెగటు పుట్టించినా, ఓవరాల్ గా మాత్రం అందరూ ఆదరించే షో ఇదే అని చెప్పాలి. అరుంధతి ప్రొడ్యూసర్ శ్యాం ప్రసాద్ రెడ్డి సొంత బ్యానర్ అయిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఒక ప్రముఖ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ షో తెలుగు టీవీ షో లలో అత్యంత ప్రజాదరణ పొంది , టీఆర్పీ ని సంపాదించుకుంది. అందులో నటించిన నటులు అందరికీ కూడా మంచి ఫ్యాన్ బేస్ ని కూడా సెట్ చేసింది అంటే , ఈ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే , ఈ షో కి సంబంధించి ఒక దుర్వార్త బయటకు వచ్చింది. జబర్దస్త్ షూటింగ్ జరుపుకుంటున్న స్టూడియో లో ప్రమాదం జరిగింది.

ఏమి జరిగింది:

వివరాల్లోకి వెళితే ,  జబర్దస్త్ సెట్ లో షూటింగ్ జరుగుతుండగా అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో లోని మొదటి ఫ్లోర్ లో షూటింగ్ జరుగుతున్న స్పాట్ లో ఒక్క సారిగా సెట్ కుప్పకూలిపోవడంతో అక్కడున్న వారందరూ అప్పటికప్పుడు అలెర్ట్ అయ్యారు. అదే సమయంలో స్టేజి పైన స్కిట్ చేస్తున్న సుడిగాలి సుదీర్ , రాం ప్రసాద్ వారిద్దరితో పాటు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కూడా కింద పడిపోయారు. సుడిగాలి సుదీర్ వెల్లికిలా పడిపోవడంతో కొంత సేపు పాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

హాస్పిటల్ కి సుడిగాలి సుదీర్

అయితే సుదీర్ విషయానికి వస్తే పక్కనే ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లగా  కాసేపటికి కోలుకున్నాడు. అక్కడున్న జబర్దస్త్ టీం వారందరూ అతనికి రెస్ట్ తీసుకోమని సూచించగా , అతను నిరాకరించాడు.

వెంటనే , సుడిగాలి సుదీర్ మళ్ళీ టైం వేస్ట్ కాకూడదు అని చెప్పి , స్కిట్ లో నటించాదానికి సిద్ధం అవ్వడంతో అక్కడున్న టీం సభ్యులందరూ అతనిని అభినందనలతో ముంచెత్తారు.

పూర్తయ్యిన shooting:

సెట్స్ ని మళ్ళీ రిపేర్ చేసి షూటింగ్ కి అంతా సిద్ధం చెయ్యడంతో మళ్ళీ ఆరభం అయ్యింది. నాగబాబు , రోజా అందరూ షూటింగ్ స్పాట్ కి చేరుకోగా , షూటింగ్ లేట్ నైట్ కూడా సజావుగా సాగిపోయింది. తనకి అంత జరిగినా సరే షూటింగ్ ఆగిపోకుడదని వెంటనే పాల్గొన్న సుడిగాలి సుదీర్ డెడికేషన్ ని అందరూ మెచ్చుకున్నారు. మొత్తం మీద జబర్దస్త్ ప్రమాదం అలా సుఖాంతం అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకోగాలిగారు.