Monday, September 24, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

విరాట్ అనుష్క ల కొత్త ఇల్లు అద్దె ఎంతో తెలుసా?

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమి చేసినా న్యూసే. ఆయన పెళ్లి కూడా అంత మంది మీడియా కి తెలియకుండా విదేశాల్లో రహస్యంగా జరుగుపుకోవడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వారిరువురు ఎక్కడికెళ్ళినా అది న్యూస్ అవుతోంది. వారు తీసుకున్న కొత్త ఇల్లు దగ్గరనుండి ప్రతి చిన్న విషయం వార్తగా మారి సంచలనం సృష్టిస్తోంది. తాజాగా విరాట్ అనుష్క కలిపి తీసుకున్న ఒక ఇల్లు గురించి ఇంటర్నెట్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పెళ్లి గుట్టుచప్పుడు కాకుండా విదేశాల్లో చేసుకున్నా , అక్కడ అంగరంగ వైభవంగా పెళ్లిని జరుపుకున్నారు. అత్యంత ఖరీదైన భవనం వీరి పెళ్ళికి అద్దెగా ఇచ్చారు. అప్పట్లోనే వీరి పెళ్లి భవనం అద్దె ఒక్క రోజుకి 20 లక్షలు ఉంటుంది అని అన్నారు. అయితే పెళ్లి సంగతి పూర్తీ అయ్యాక , వీరిద్దరూ ఇప్పుడు ముంబై కి వచ్చి సరికొత్త నివాసాన్ని ఏర్పరుచోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టు ఉంది. వారిద్దరూ ఇప్పుడు ఒక ఇంటి వారయ్యారు. ఇప్పటికే ముంబై లోని వోర్లీ అనే ఏరియా లో అత్యంత ఖరీదైన ఇల్లుని కొనుగోలు చేసారు. అయితే ఆ ఇల్లు నిర్మాణం పూర్తయ్యేదాకా మరొక చోట ఇల్లు వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది.

ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం రహేజా లెజెండ్స్ అనే అపార్ట్ మెంట్ లో 40వ ఫ్లోర్ లో వారు ఇల్లు తీసుకున్నారు.  ఈ ఫ్లాట్ దాదాపు 2675 చదరపు అడుగుల వైశాల్యం ఉంది. అయితే ఈ ఇంటికి వారు కడుతున్న అద్దె కూడా ఎక్కువే. దాదాపుగా ఈ ఇంటికోసం వారు 15 లక్షల రూపాయలని నెలసరి అద్దెగా కట్టాలి. ఆ ఇంటికి డిపాజిట్ అమౌంట్ ఏ ఒక కోటి 50 లక్షల రూపాయల దాకా కట్టినట్టు సమాచారం. ఇకపోతే ఆ ఇంటి రిజిస్ట్రేషన్ ఖర్చు కేవలం ఒక రూపాయి మాత్రమే అంట. 5 BHK అపార్ట్ మెంట్ అయిన ఈ ఇంట్లో వారికీ అన్ని రకాల సదుపాయాలూ ఇవ్వబడతాయి. వారికి ఇళ్లలోనే జిమ్ , ఇంటి మేడ, అలా సముద్రాన్ని చూడటానికి అనువైన స్థలం అన్నీ ఏర్పడుతాయి.