Monday, March 25, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

హ‌రీష్ రావుపై కుట్ర‌…లీక్ చేస్తున్నారా,…వీక్ చేస్తున్నారా..?

మంత్రి హ‌రీష్ రావు పార్టీ మారుతున్నారా..? అది కూడా పట్టులేని బీజేపీలోకా..? ఇప్ప‌టికే అమిత్ షా చ‌ర్చ‌లు జ‌రిపారా..? ఇక కాషాయ జెండా క‌ప్పుకోవ‌డ‌మే మిగిలుందా….ఇలా అనేక అనుమానాల‌కు ఊత‌మిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు సిద్దమంటూ ఎప్పుడైతే ప్ర‌కట‌న చేశాడో అప్ప‌టినుంచి “మంత్రి హ‌రీష్ రావును,ఆయ‌న బ‌లాన్ని దెబ్బ తీసేందుకు” ఓ వ‌ర్గం ప‌నిగ‌ట్టుకుని క‌థ‌నాలు,ఊహాగానాలు ప్ర‌సారం చేస్తుంది.

కేసీఆర్ దేశ‌రాజ‌కీయాల్లోకి వెళ్తుండ‌టంతో ఇక కేటీఆర్ కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లేన‌ని,కాబోయే సీఎం కూడా కేసీఆర్ త‌న‌యుడే కాబ‌ట్టి,ఇక హ‌రీష్ రావుకు పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గిన‌ట్లేన‌ని అందుకే ఆయ‌న క‌మ‌లం పార్టీలో చేరేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడంటూ పుకార్లకు తెర‌లేపింది ఓ వ‌ర్గం.

కేసీఆర్ కు మొద‌ట్నుంచి అండ‌గా ఉంటూ,ఉద్య‌మ‌సమ‌యంలో వెన్నుద‌న్నుగా నిలిచి, టీఆర్ఎస్ పార్టీకి అన్నీతానై న‌డిపించిన హ‌రీష్ రావుకు రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది.అలాంటి లీడ‌ర్ ను వీక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు కొంద‌రు బీజేపీ నేత‌లు.మంత్రి హ‌రీష్ కార‌ణంగా కొంతమంది ఎమ్మెల్యేలు,ఎంపీలు గెలిచార‌న్న‌ది వాస్త‌వం,గెలుస్తార‌న్న‌ది కూడా వాస్త‌వం.ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి గ్రూపు రాజ‌కీయాలు మెయింటైన్ చేయ‌ని హ‌రీష్ రావుకు పార్టీ ప‌రంగా,ప్ర‌భుత్వ‌ప‌రంగా ఒక్క మ‌చ్చ కూడా లేదు. పార్టీల‌కతీతంగా ఆయ‌న‌కు అభిమానులు లేక‌పోలేదు. ప‌ద‌వుల కోసం పాకులాడిని వ్య‌క్తి అస‌లు కానే కాదు. ఏండ్ల కొద్దీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమ‌యం చేయాలన్న‌దే ఆయ‌న క‌ల‌.రాష్ట్రానికి నీళ్ల వ‌స‌తి ఉన్నా, ఎడారిలో ఎండిపోవ‌టాన్ని గుర్తించిన కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే నీటిపారుద‌ల‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. ఇవాళ 24 గంట‌ల క‌రెంట్ వ‌స్తుందన్నా, రాష్ట్రవ్యాప్తంగా మిష‌న్ కాక‌తీయ‌తో చెరువులన్నీ నిండుకుండ‌లా క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌న్నా, ఇంటింటికీ మిష‌న్ భ‌గీర‌థ‌తో న‌ల్లానీరు అందివ్వ‌బోతున్నామ‌న్నా అదంతా హ‌రీష్ రావు క‌లే..ఆయ‌న స్వ‌ప్నం నెర‌వేరేందుకు నిర్విరామంగా శ్ర‌మిస్తుంటే కొంద‌రు మాత్రం లేనిపోని వ‌దంతులు వేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు.

బీజేపీలో చేర‌తారా…?

మొన్న‌టిదాకా కాంగ్రెస్ లో చేర‌తాడంటూ పుకార్లు రేపిన వాళ్లే ఇప్పుడు తాజాగా బీజేపీలో చేర‌బోతున్నాడంటూ ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టారు.ఆయ‌న‌తో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ 40 మంది ఎమ్మెల్యేల‌ను బీజేపీలోకి తీసుకెళ్తున్నాడ‌ని,అమిత్ షా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని ఫ‌లితం రేపో మాపో ఉండ‌బోతుందంటూ చెప్ప‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి హ‌రీష్ రావుకు ఉన్న బ‌లం కూడా ఇదే. ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయాలన్నీ హ‌రీష్ రావు చుట్టే తిరుగుతున్నాయి. ఎలాగైనా ఆయ‌న్ను పార్టీలో చేర్చుకుంటే ఇక అధికారం త‌మ‌దేన‌న్న ధీమాతో ఊవిళ్లూరుతున్నాయి పలు పార్టీలు.ఆయ‌న చేరిక‌పై ఆశ‌గా ఎదురుచూస్తున్న వాళ్లు చాలామంది ఉన్న‌ప్ప‌టికీ హ‌రీష్ రావు నైజం మాత్రం అది కాద‌ని తెలుసుకోలేక‌పోతున్నారు.మొన్న‌టిదాకా బ‌ల‌మైన నాయకుడి కోసం ఎదురుచూసిన‌ కాంగ్రెస్ పార్టీకి ఆయుధంలా రేవంత్ రెడ్డి దొరికాడు.ఇక రేవంత్ చేరిక‌తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది.ఇక ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ కూడా ఓ్ స్ట్రాంగ్ లీడ‌ర్ కోసం గాలింపులు మొద‌లు పెట్టింది. రాష్ట్ర‌మంతా భూత‌ద్ధం ప‌ట్టుకుని తిరిగినా హ‌రీష్ రావును మించిన నాయ‌కుడు క‌నిపించక‌పోవ‌టంతో ఇక త‌మ ఆశ‌ను అత్యాశ‌గా మార్చుకుని హ‌రీష్ రావు క‌మ‌లం గూటికి క‌న్ఫాం అంటూ వార్త‌లు రాస్తున్నారు.

హరీష్ రావుపై కుట్ర‌…?

ఈ పుకార్ల కార‌ణంగా ఇటు బీజేపీ వాళ్ల‌కే కాదు, టీఆర్ఎస్ లోని ఓ వ‌ర్గానికి కూడా లాభం లేక‌పోలేదు.ఎందుకంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అంత‌టి నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే అది హ‌రీష్ రావు ఒక్క‌రే.కాబ‌ట్టి హ‌రీష్ రావును పార్టీ నుంచి సాగ‌నంప‌డం ద్వారా త‌మ పెత్త‌నం చెలాయించుకునేందుకు వీలుగా ఉంటుంద‌ని భావించిన వాళ్లు సైతం బీజేపీ నేత‌లతో చేతులు క‌లిపి మైండ్ గేమ్ కు తెర‌దీశారు. హ‌రీష్ రావుకు బీజేపీని అంట‌క‌ట్ట‌డం ద్వారా రెండు ర‌కాలుగా లాభం చేక‌రూరుతుంద‌ని భావించి అసంబ‌ద్ధ‌మైన,అస‌హ‌జ‌మైన వార్త‌ల‌కు కార్య‌రూపం దాల్చుతున్నారు. అస‌లు ఊసే లేని వార్త‌పై క‌థ‌నాలు ర‌చించి హ‌రీష్ రావు ఇమేజ్ కు డ్యామేజ్ చేసే ప‌నిని ముంగ‌లేసుకున్నారు.

హ‌రీష్ రావును టీఆర్ఎస్ నుంచి సాగ‌నంపాల‌ని ఎవరెన్ని ప్ర‌యత్నాలు చేసినా, లేనిపోని క‌థ‌నాల‌కు ప్రాణం పోసి గాలం వేయాల‌ని చూసినా వృథా ప్ర‌యాసే త‌ప్పితే ఒరిగేదేమి ఉండ‌ద‌ని తెలుసుకుంటే మంచిదేమో…
త‌న త‌ర్వాత ముఖ్య‌మంత్రి కేటీఆరే అని ఏనాడు కేసీఆర్ చెప్ప‌లేదు,.అలాగే తాను ముఖ్య‌మంత్రిని కావాల‌నుకుంటున్నాన‌ని హ‌రీష్ రావు కూడా అన‌లేదు. పార్టీలో క్రియ‌శీల‌కంగా ప‌నిచేసిన వారికి ప‌ద‌వులు వాటంత‌ట అవే వ‌స్తాయి. రాదు అనుకున్న తెలంగాణే వ‌చ్చింది…ఇక సీఎం కుర్చీ ఓ లెక్క‌నా..రాసి పెట్టి ఉంటే దానంత‌ట అదే వ‌స్త‌ద‌న్న విష‌యం మ‌ర్చిపోకూడ‌దు…