Monday, March 25, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

చంద్ర‌బాబూ..ర‌వీంద్ర‌కే ఎందుకు..?

చంద్ర‌బాబు నాయుడు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ్య‌స‌భ ఎంపిక‌లో మ‌ళ్లీ ఆయ‌న పంథా ఏంటో స్ప‌ష్టం చేశారు.సీఎం ర‌మేష్ కు మ‌రో ద‌ఫా అవ‌కాశం ఇస్తార‌ని భావించారు.కానీ రెండో సీటును క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ కు ఇస్తార‌ని మాత్రం అస‌లు ఎవ‌రూ ఊహించ‌లేదు.పార్టీ సీనియ‌ర్ నేత‌ల్లో మిన‌హా కిందిస్థాయి క్యాడ‌ర్ కు అస‌లు ర‌వీంద్ర కుమార్ అంటే ఎవ‌రో కూడా పెద్ద‌గా తెలియ‌దు.కానీ చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది.

పార్టీకి ఎప్పుడు ఏ క‌ష్టం వ‌చ్చినా ఆదుకునేందుకు తానున్నాంటూ సీనియ‌ర్ న్యాయ‌వాదిగా ర‌వీంద్ర‌కుమార్ చేసిన‌,చేస్తున్న సేవ‌లు అన్నీ ఇన్నీ కావు.గ‌త 22 ఏళ్లుగా టీడీపీ కోసం న్యాయ‌సేవ‌లు అందించ‌టంలో ర‌వీంద్ర‌కుమార్ శ్ర‌మ అద్వితీయం.ఏనాడు ప‌ద‌వుల కోసం పాకులాడ‌కుండా పార్టీ కోస‌మే త‌న జీవితం అన్న‌ట్లుగా అంకిత భావంతో ప‌నిచేసిన ర‌వీంద్ర‌కుమార్ కు అదృష్టం ఇన్నాళ్ల‌కు క‌లిసొచ్చింది. పార్టీకి సేవ‌లందించే వారికి ఎప్ప‌టికైనా ప‌ద‌వులు రాక‌పోవు అన్న దాన్ని మ‌రోసారి నిరూపించాడు చంద్ర‌బాబు.అందుకే ర‌వీంద్ర‌కుమార్ ను ఎంపిక చేసి మంచి మార్కులే కొట్టేసాడు.

ఇక మూడో స్థానానికి కూడా టీడీపీ పోటీ చేస్తుంద‌ని భావించారు. వైసీపీని ఎలాగైనా ఓడించి ఆ సీటును కూడా త‌మ ఖాతాలో వేసుకునేందుకు స‌న్నాహాలు చేస్తున్నారంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి.కానీ చంద్ర‌బాబు మాత్రం మూడో అభ్య‌ర్థిని నిల‌ప‌డంపై సాహ‌సం చేయ‌లేదు.పోటీ చేస్తే ఓడిపోతామ‌నుకున్నారో లేక‌, గెల‌వ‌ని సీటుకు పోటీ ఎందుకు అనుకున్నారో తెల‌వదు క‌నీ,వైసీపీ భ‌యాన్ని మాత్రం త‌ప్పించారు.ఇక మూడో అభ్య‌ర్థి రంగంలో లేక‌పోవ‌డంతో వైసీపీ అభ్య‌ర్థి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క కానుంది.మొత్తానికి మూడు సీట్లు ఏక‌గ్రీవం కానున్నాయి.

ఇక మ‌రోవైపు, రాజ్య‌స‌భ సీటు త‌మ‌కే ద‌క్కుతుంద‌ని మొద‌టినుంచి ఆశ‌లు పెట్టుకున్న ఇద్ద‌రు ముగ్గురు నేత‌లు అసంతృప్తికి లోనైన‌ట్లు స‌మాచారం.టీడీపీకి ఢిల్లీ ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కంభంపాటి రాంమ్మోహ‌న్ రావు,వ‌ర్ల రామ‌య్య వంటి నేత‌లు కాస్త నిరాశ‌కు గురైన‌ట్లు తెలుస్తుంది.వీరిద్ద‌రిలో ఒక‌రిని రాజ్య‌స‌భ బెర్త్ క‌న్ఫాం అన్న ప్ర‌చారం సాగింది.కానీ చివ‌రినిమిషంలో ర‌వీంద్ర‌కుమార్ ను ఎంపిక చేయ‌టంతో ఇక ప‌లువురు నేత‌లు అస‌హనంతో ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ అస‌హ‌నం రేపో మాపో తూడ్చిపెట్టుకు పోవ‌డం కామ‌న్.కానీ,క‌న‌క‌మేడ‌ల‌కు అదృష్టం క‌లిసిరావ‌టం మాత్రం నిజంగా పార్టీ కోస‌మే ప‌నిచేస్తున్న వారిలో ఆశ‌లను స‌జీవంగా మ‌లిచింది.