Wednesday, December 12, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

122 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టిన బౌలర్

దాదాపు 122 ఏళ్ల రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో సెయింట్ జార్జ్ పార్క్‌లో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ గత 122 ఏళ్లలో ఎవరూ సాధించని రికార్డు సృష్టించాడు. రెండో టెస్టులో 11 వికెట్లు తీసిన రబడ ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో మరే బౌలరూ సాధించని ఘనత సాధించాడు. టెస్టుల్లో 38.9 స్ట్రైక్ రేటుతో వందకు పైగా వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గత 122 ఏళ్లలో ఈ ఘనత సాధించింది రబడ ఒక్కడే. అంటే తను వేసిన ప్రతి 39వ బంతికి ఒక వికెట్ నేల కూల్చాడన్నమాట. ఈ మ్యాచ్‌లో 11 వికెట్లు సాధించిన రబడ.. 10కిపైగా వికెట్లు నేలకూల్చడం ఇది నాలుగోసారి కాగా, రెండో దక్షిణాఫ్రికా ఆటగాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ లెమన్ 1896లో 34.1 స్ట్రైక్ రేట్‌ సాధించాడు.

ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రబడ 38.9 స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకే చెందిన డేల్ స్టెయిన్ 41.5 స్ట్రైక్ రేట్‌తో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. 1914లో ఇంగ్లండ్‌కు చెందిన సిడ్నీ బార్నెస్ 41.6 స్ట్రైక్ రేట్ సాధించగా పాకిస్థాన్‌కు చెందిన వకార్ యూనిస్ 2003లో 43.4 స్ట్రైక్ రేట్ సాధించాడు. ఇదిలా ఉంటే రబాడ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 239 పరుగులకే ఆలౌటైంది. 180/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగోరోజైన సోమవారం ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 59 పరుగులకే మిగితా ఐదు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాకు 101 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి దక్షిణాఫ్రికా లంచ్‌ సమయానికి ఓ వికెట్‌ కోల్పోయి 22 పరుగులు చేసింది. అంతకముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌ సెంచరీతో రాణించడంతో 139 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.