Wednesday, December 12, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

వర్మకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి

అర్జున్‌ రెడ్డి సినిమాతో సౌత్‌ లోమోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు యువ నటుడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో చేతి నిండా సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ ట్రావెల్‌ డ్రామాలో నటిస్తున్న ఈ విజయ్‌ ఈ సినిమాతో పాటు మహానటి షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. ఈరెండు సినిమాల తరువాత తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న నోటా షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు.

తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం వర్మ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా విజయ్, వర్మ సినిమాకు నో చెప్పాడట. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఆఫీసర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ మరికొన్ని సినిమాలను ఇప్పటికే ప్రకటించాడు. సినిమా విషయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా ఫేవర్‌గా మాట్లాడారు. అర్జున్‌రెడ్డి సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. అయితే తాజాగా వర్మ ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండతో సినిమా తీయాలని భావించారట. అనుకున్నదే తడవుగా విషయాన్ని విజయ్‌కు చెప్పారట.. కానీ విజయ్ నో చెప్పేసి వర్మకు షాక్ ఇచ్చాడట తర్వాత తన సాధ్యాసాధ్యాలను వర్మకు విజయ్ వివరించినట్టు సమాచారం.

ఏది పడితే అది చేయకుండా..

ఇదిలా ఉండగా,  ఏది పడితే అది చేయకుండా.. మంచి కంటెంట్ ఉంటేనే సినిమా చేయాలనే నిర్ణయంతో.. సెలక్టివ్‌గా సినిమాలు అంగీకరిస్తున్నాడు విజయ్. ‘నోటా’ అనే టైటిల్‌తో తెరకెక్కబోయే చిత్రంతో తమిళ్‌లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడీ అర్జున్ రెడ్డి. ‘నోటా’ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తాడనే టాక్ నడుస్తున్న తరుణంలో.. తాజాగా విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ పేజీలో ఓ పిక్‌ని పోస్ట్ చేశారు. ఈ పిక్‌లో ఆయన మేకోవర్ చూస్తుంటే నిజంగానే విలన్‌లా అనిపిస్తున్నాడు. ఈ పిక్ ఇప్పుడు వైరల్‌లా సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.