Wednesday, December 12, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

ఆస్పత్రిలో అమితాబ్.. విషాదంలో కుటుంబ సభ్యులు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నిన్న(మంగళవారం) అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్న ఆయన హెవీ కాస్ట్యూమ్స్ కారణంగా అస్వస్థత పాలయ్యారు. తన ఆరోగ్యం క్షీణించినపుడు అమితాబ్ జోథ్‌పూర్‌లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ షూటింగ్ చేస్తున్నారు. డాక్టర్ల బృందం ఆయన్ను పరిశీలిస్తోంది. అమితాబ్ ప్రస్తుతం తీవ్రమైన భుజం నొప్పి, వెన్ను, మెడనొప్పితో బాధపడుతున్నారు.

నిన్న జయాబచ్చన్ కూడా దీనిని కన్ఫామ్ చేశారు. ”అమితాబ్ బాగానే ఉన్నారు. ఆయనకు బ్యాక్, మెడ నొప్పితో బాధపడుతున్నారు. హెవీ కాస్ట్యూమ్స్ కారణంగా కొంచెం నొప్పితో బాధపడుతున్నారు. అని జయాబచ్చన్ తెలిపారు. ట్రీట్‌మెంట్ అనంతరం అమితాబ్ కాస్త బెటర్‌గా ఫీలవుతున్నారు. చికిత్స అనంతరం తాను బెటర్‌గా ఫీల్ అవుతున్నట్టు అమితాబ్ కూడా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..

ఇదిలా ఉండగా.. ప్రముఖ బాలీవుడ్ నటి, బిగ్ బి అమితాబ్ సతీమణి, రాజ్యసభ అభ్యర్థిని జయాబచ్చన్ తన ఆస్తి వెయ్యికోట్ల రూపాయలని ప్రకటించి రాజ్యసభ సభ్యుల్లోనే అత్యంత ధనవంతురాలిగా నిలిచింది. సమాజ్ వాది పార్టీ తరపున ఎంపీగా రాజ్యసభ బరిలోకి దిగిన జయాబచ్చన్ తన నామినేషన్ పత్రంలో తన ఆస్తి వెయ్యికోట్లని చూపించారు. తన భర్త అమితాబ్ తో కలిసి 62 కోట్ల బంగారం ఉందని జయా బచ్చన్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. మొత్తం 13 కోట్ల విలువగల 12 కార్లు ఉన్నాయని ఇందులో రోల్స్ రాయిస్, మూడు మెర్సిడెస్, ఒక ఫోర్డ్, రేంజ్ రోవర్, టాటా నానో కార్లతోపాటు ఓ ట్రాక్టరు ఉందని ఆమె వెల్లడించారు. జయా, అమితాబ్ దంపతులకు ఫ్రాన్స్ లోని బ్రిగ్నోగాన్ ప్లేగ్ లో 3,175 చదరపుగజాల విస్తీర్ణంలో భవనం ఉందని వెల్లడైంది. దీంతోపాటు దేశంలోని నోయిడా, భోపాల్, పూణే, అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల్లో వారికి ఆస్తులున్నాయి. అమితాబ్ బచ్చన్ కు 9 లక్షల విలువగల పెన్ను కూడా ఉందట. జయాబచ్చన్ కు లక్నోలోని కకోరీ ప్రాంతంలో 2.2 కోట్ల విలువగల 1.22 హెక్టార్ల వ్యవసాయభూమి, అమితాబ్ కు బరాబంకీ జిల్లా దౌల్తాపూర్ లో 5.7 కోట్ల విలువగల మూడు ఎకరాల భూమి ఉందని జయా తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. జయాబచ్చన్ ఆస్తి 2012లో రూ.493కోట్లు కాగా ఐదేళ్లలో రెట్టింపు అయింది.