Monday, September 24, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

లాంతరు గుర్తుతో పోటీ చేస్తున్న సినీ నటుడు ఆది!

ప్రముఖ సినీ నటుడు , అలనాటి దర్శకుడు రావిరాజా పిని శెట్టి కుమారుడు ఆది రాజకీయ రంగంలో పోటీ చెయ్యబోతున్నారు. అయితే అది ఎన్నికలలో కాదు , సినిమాలో అండి బాబోయ్. ఆయన ప్రస్తుతం నటిస్తున్న రంగస్థలం సినిమా షూటింగ్ లో భాగంగా రాజకీయ పోస్టర్ ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. కాసేపటి క్రితమే విడుదల అయిన ఈ సినిమా పోస్టర్లు అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి రంగస్థలం సినిమా రాం చరణ్ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా బజ్ ని జెనరేట్ చేసి అభిమానులకు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇకపోతే ఈ సినిమా కి దర్శకుడు అయిన సుకుమార్ , మొట్టమొదటి సారి ఫక్తు కమర్షియల్ సినిమా చెయ్యడం , సమంతా ని ఎప్పుడూ చూడని విధంగా డీ గ్లామర్ రోల్ లో చూపించడం ఈ సినిమా పై ఉన్న అంచనాలని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.

ఇప్పటికే విడుదల అయిన రంగస్థలం టీజర్ కోటి వ్యూస్ ని దాటి రికార్డులు బద్దలు కొట్టుకుంటూ పోతోంది. దానికి తోడు ఇప్పటిదాకా విడుదల అయ్యిన ఈ సినిమా సింగల్ పాటలు ఒక్కొక్కటీ మోత మోగిస్తున్నాయి. ఇప్పుడు , కొత్తగా సమంతా లుక్ తరువాత ఆది ఫస్ట్ లుక్ ని ఎప్పుడూ లేని విధంగా లాంచ్ చెయ్యడం మరో విశేషం.

రంగస్థలం సినిమా ఎక్కువగా 1985 నేపథ్యంలో నడుస్తుంది. అప్పటి పరిస్థితులు , రాజకీయాలు వాటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు ఈ సినిమాలో . ఇందులో రాం చరణ్ కి సోదరుడిగా ఆది పిని శెట్టి నటిస్తున్నారు. ఆయన ఈ సినిమాలో రాజకేయాలోకి వెళ్ళే పాత్రలో కనిపించనుండటం విశేషం. వీరిద్దరికీ మాధ్యన జరిగే గొడవలకు సంబందించిన సన్నివేశాలు ఈ సినిమాకి కీలకం అంటున్నారు ఈ చిత్ర బృందం సభ్యులు. మరొక రకంగా ఈ సినిమాకి ఆది పాత్ర ప్రధాన ఆకర్షణ అంటున్నారు కూడా.

అయితే ఇందాక విడుదల అయిన ఈ పోస్టర్ లో 1985 నాటి హెయిర్ స్టైల్ , కాళ్ళ జోడు , పేరుకి ఇంటి పేరు కే. ( కొణిదెల కూడా కావొచ్చు ఏమో) ఉన్నాయి. దానితో పాటు లాంతరు గుర్తుపై ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నట్టు ఆ పోస్టర్ లో ఉంది. అందులో తనకు ఓటు వెయ్యమని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే రాం చరణ్ పాత్ర కూడా ఈ సినిమాలో వైవిధ్యంగా కనిపించనుంది అని టాక్. ఈ సినిమాలో సౌండ్ ఇంజనీర్ అని చెబుతున్న పాత్రలో రాం చరణ్ తన పాత్రకు కాస్త చెవుడు అని చెప్పకనే చెబుతున్నట్టు తెలుస్తోంది. ఏదైతే ఏముంది, మొత్తం మీద రంగస్థలం రాం చరణ్ కెరీర్ ని పీక్స్ కి తీసుకెళ్తుంది అని ఆశిద్దాం.